8న టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం…

హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 6 :

ఈనెల 8న (సోమవారం) ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరు అవుతారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ లు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు అధికార ప్రతినిధులు, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సకాలంలో సమావేశానికి హాజరయ్యి సమావేశాన్ని విజయవంతం చేయగలరని టిపిసిసి కోరింది.

Leave A Reply

Your email address will not be published.