నా జీవితం తెరిచిన పుస్తకం… కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్ రావు… 

నా జీవితం తెరిచిన పుస్తకం…

కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్ రావు…

హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 6 :

నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని శనివారం వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు అన్నారు.
కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. హరీష్‌ రావు తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని, కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం అని హరీష్ రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.