ప్రమాదకరంగా డిచ్‌పల్లి రోడ్డు… ప్రాణాతకరంగా మారిన ప్రయాణం… దారులు కాదు.. నరకానికి నకళ్లు..!

ప్రమాదకరంగా డిచ్‌పల్లి రోడ్డు…

ప్రాణాతకరంగా మారిన ప్రయాణం…

దారులు కాదు.. నరకానికి నకళ్లు..!

డిచ్‌పల్లి వార్తటుడే

డిచ్‌పల్లి మండలం నుండి నిజామాబాద్ వెళ్ళే రహదారి నడిపల్లి వద్ద ప్రమాదకరంగా మారిన రోడ్డుపై భారీ గుంతలు. నిత్యం ప్రమాదాలతో ప్రజలు సావాసం -అవి దారులు కాదు.. నరకానికి నకళ్లు..! ఏ రోడ్డు చూసినా అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు.. వాటిపై ప్రయాణమంటే ప్రమాదం వైపు పయనమే.

 

మరమ్మతులు చేయకపోవడంతో గుంతలుగా మరి, తారు లేచి, కంకర తేలిన ఆర్‌అండ్‌బీ రహదారీ.. కచ్చా రోడ్ల కంటే దారుణంగా తయారయ్యాయి. ఒక్కో చోట 50 సెం.మీ.లకుపైగా లోతు, ఐదారడుగుల పొడవు, వెడల్పు ఉన్న పెద్ద గోతులు పడ్డాయి. అయినా విధిలేని పరిస్థితిలో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల్లోనూ, ద్విచక్ర వాహనాలపైనా ప్రయాణించేవారి పరిస్థితి అయితే నిత్యం నరకమే.

Leave A Reply

Your email address will not be published.