రాజకీయ కక్షపూరిత చర్య…  కెసిఆర్ పై అక్రమ కేసులకు ప్రయత్నలు… బీఆర్ఎస్ ఆందోళన రాస్తా రోకో… మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…

రాజకీయ కక్షపూరిత చర్య…

కెసిఆర్ పై అక్రమ కేసులకు ప్రయత్నలు…

బీఆర్ఎస్ ఆందోళన రాస్తా రోకో…

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…

డిచ్‌పల్లి వార్తటుడే సెప్టెంబర్ 2 :

ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టడంపై నిరసన గా డిచ్‌పల్లి నిజామాబాద్ ప్రధాన రహదారి పై బీఆర్ఎస్ నాయకులు రాస్తా రోకో చేశారు.నిరసన లో మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయంగా కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకనే అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను మరిచి రాజకీయ కక్షలకు పాల్పడుతుందని అన్నారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

కాలేశ్వరం ప్రాజెక్ట్ తో ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని దీనిని ఓర్వలేకనే రేవంత్ రెడ్డి కెసిఆర్ పై అక్రమ కేసులకు తెరలేపాడని అని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ బాజి రెడ్డి జగన్ మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ, గడ్కోల్ భూషణ్ రెడ్డి, పద్మారావు, మహేందర్ యాదవ్, తొర్లికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.