డైరెక్టర్ గా సీఎస్ఐ నాకు అవకాశం ఇచ్చింది : డాక్టర్ అజ్జ శ్రీనివాస్

డైరెక్టర్ గా సీఎస్ఐ నాకు అవకాశం ఇచ్చింది

డాక్టర్ అజ్జ శ్రీనివాస్

డిచ్పల్లి, వార్తటుడే, ఆగస్టు 18 :

నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న సిఎంసి హాస్పిటల్, కాలేజ్ డైరెక్టర్ గా నన్నే కొంసాగించారని, ఈనెల ఒకటిన గౌరవ డైరెక్టర్ గా నియమించారని డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సిఎంసి కళాశాలలో మీడియతో మాట్లాడారు. సీఎంసి హాస్పిటల్, కళాశాల పునః ప్రారంభించడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చైర్మన్ షణ్ముఖ మహాలింగం రూ.100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పారు. నిజామాబాద్ లో ఉన్న ఒక డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తో పాటు అతని సమీప వ్యక్తితో కలిసి సిఎంసి హాస్పిటల్, కాలేజీలో పెట్టుబడి పెడితే 5% షేర్ హోల్డర్ గా ఇచ్చి డైరెక్టర్ ను చేస్తానని నమ్మించాడు. అతని వద్ద నుంచి ఐదు కోట్ల విలువైన చెక్కులను తీసుకున్నాడు. కాలేజీలో ప్రారంభించడానికి మూతబడిన భవనాలను మరమ్మత్తులు చేయడానికి, హాస్పటల్ సామాగ్రికి డాక్టర్ అజ్జ శ్రీనివాస్ రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాడు. షణ్ముఖ మహాలింగం మూడు నెలలుగా సిబ్బందిని నియమించుకొని డాక్టర్లు, నర్సులు, సానిటైజేషన్, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్,హాస్పిటల్, కాలేజీకి కావలసిన సిబ్బంది మొత్తాన్ని ఏర్పరచుకొని గత మూడు నెలలుగా పని చేయించుకుని వారికి జీతాలు ఇవ్వకుండా మోసం చేశాడు. గత నెల మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ బృందం సందర్శించింది. ఆ రోజు నుంచి షణ్ముఖ మహాలింగం కనబడకుండా పోయాడు. నెల రోజుల తర్వాత వచ్చిన (ఐఎంఎస్ఆర్) చైర్మన్ షణ్ముఖ మహాలింగంను హాస్పిటల్ సిబ్బంది నిలదీసి పోలీసులకు అప్పగించారు. వారికి మూడు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. షణ్ముఖ లింగంపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని సిబ్బంది కోరారు. షణ్ముఖ మహలింగం సిఎస్ఐ యాజమాన్యానికి ఒప్పుకున్న మొత్తాన్ని అందించక, దానితోపాటు సీఎంసి మెడికల్ కళాశాల, హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వక సిఎంసి మెడికల్ కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని అతని ఒప్పందాన్ని రద్దు చేస్తూ తమ ఆధీనంలో తీసుకున్నది. సిఎంసి హాస్పిటల్ లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇచ్చి, డాక్టర్లను నియామకం చేసుకున్నారు. దానితోపాటు డాక్టర్ అజ్జ శ్రీనివాస్ కు డైరెక్టర్ గా నియామకం చేశారని తెలిపారు. షణ్ముఖ మహాలింగం మీడియా సమావేశం పెట్టి డాక్టర్ అడ్జ శ్రీనివాస్ పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

Leave A Reply

Your email address will not be published.