హైదరాబాద్‌లో తొలి ఆర్టిఫీషియల్ బీచ్… కొత్వాల్ గూడ సమీపంలో నిర్మాణం… డిసెంబర్ 2025లో పనులు ప్రారంభం… రూ.225 కోట్లతో పనులు ప్రారంభం…
హైదరాబాద్‌లో తొలి ఆర్టిఫీషియల్ బీచ్…
కొత్వాల్ గూడ సమీపంలో నిర్మాణం…
డిసెంబర్ 2025లో పనులు ప్రారంభం…
రూ.225 కోట్లతో పనులు ప్రారంభం…
హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 28 :
హైదరాబాద్ మహానగరంలో తొలి ఆర్టిఫీషియల్ బీచ్ ఏర్పాటు కానుంది. ఇది
కొత్వాల్ గూడ సమీపంలో నిర్మించనున్నారు. దీని నిర్మాణం డిసెంబర్ 2025లో ప్రారంభమవుతుంది. రూ.
225 కోట్ల ప్రాజెక్టులో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్ళు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు & ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలో కొత్వాల్ గూడ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. బీచ్‌సైడ్ ఫీల్ రావడానికి..సహజ సిద్ధమైన సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.
పెట్టుబడి అంచనా :
ఆర్టిఫిజియల్ బీచ్ ఖర్చురూ. 225 కోట్లుకు పైగా ఉంటుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రయివేట్ భాగస్వమ్యం కోరుతుంది.
ఆకర్షణలు :
తేలియాడే విల్లాలు – స్టార్-కేటగిరీ హోటళ్ళు,
బంగీతో సహా సాహస క్రీడలు,
జంపింగ్, సెయిలింగ్, స్కేటింగ్ శీతాకాలపు ఆటలు. పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలు. వినోదం, విశ్రాంతి సౌకర్యాలు. థియేటర్లు, ఫుడ్ కోర్టులు, అలంకార ఫౌంటెన్లు, ఆధునిక వేవ్ పూల్ నిర్మిస్తారు.