రాంపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ… దేవీ నవరాత్రుల సందర్భంగా పెన్నులు అట్టల పంపిణీ…

రాంపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ

పిట్లం, వార్తటుడే, సెప్టెంబర్ 29 :

పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ మహిళలు తీరొక్క పూలతో రంగు రంగుల బతుకమ్మలను అందంగా పేర్చి,గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద బతుకమ్మను పెట్టీ,బతుకమ్మల చుట్టూ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు.అనంతరం గ్రామంలోని చెరువులో బతుకమ్మలను నీటిలో వదిలారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మందడి బాల్ రెడ్డి,గ్రామ పెద్దలు,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
@@@@@@@@@@@@@@@@

దేవీ నవరాత్రుల సందర్భంగా పెన్నులు అట్టల పంపిణీ

పిట్లం మండల కేంద్రంలోని దేవీ నవరాత్రుల సందర్బంగా పిట్లం అయ్యప్ప ఆలయంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పురోహితులు శ్రీకాంత్ పంతులు చేతులమీదుగా నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో అధ్యక్షులు నారాయణ,కార్యదర్శి బాలు, కోశాధికారి మారుతీరెడ్డి, రీజియన్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్ సభ్యులు లక్ష్మి నారాయణ చంద్ర శేఖర్, ఆలయ కమిటి అధ్యక్షులు బత్తిని జగదీశ్, నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.