జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను SC, ST లకు కేటాయించాలి
రెంజల్, వార్తటుడే, సెప్టెంబర్ 29 :
నిజామాబాదు జిల్లా బోధన్ నియోజకవర్గం పరిధిలోని రెంజల్ మండలం ఏర్పడి నేటికీ సుమారు 40 ఏళ్ళు కావస్తున్న నాటి నుండి నేటి వరకు MPP, ZPTC స్థానాలను STలకు గానీ, SC లకు గానీ గానీ రిజర్వు చేయకపోవడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన నేతలు నీరడి రవి (SC),సిరివెసు సంతోష్(BC), జాదవ్ ప్రవీణ్ నాయక్(ST), తెలిపారు.ఈ సందర్బంగా బోధన్ SUB COLLECTOR వికాస్ మహాతో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
జనాభా ధమాషా ప్రకారం చూసుకున్న రెంజల్ మండలం లో SC లు, ST లు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ SC, ST లకు అవకాశం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత రిజర్వేషన్స్ రొటేషన్ ప్రకారం కల్పిస్తున్నాప్పటికీ రెంజల్ స్థానాన్ని జనరల్ కేటాయించడం పట్ల వారు అసంతృప్తి వ్యక్త పరిచారు.
లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకుని రెంజల్ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని SC, ST లకు కేటాయించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
లేనిపక్షంలో దళిత, బహుజన, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెప్పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఎస్సి ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కో కన్వినర్ నీరడి రవి, బిసి విద్యార్థుల సంగం జిల్లా అధ్యక్షులు సిరివె్సు సంతోష్, గిరిజన విద్యార్థులు సంగం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ జాదవ్, బహుజన నాయకులు సుభాష్, సాయిలు తదితరులు ఉన్నారు.