బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి
నిజామాబాద్ అర్బన్, వార్తటుడే, సెప్టెంబర్ 8 :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి అని రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక చేశారు. నిజామాబాద్ నగరంలో బిజెపిలో కీలక నాయకురాలిగా పనిచేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి ఫ్లోర్ లీడర్ గా కూడా కొనసాగుతున్నారు. అలాగే మహిళా విభాగంతో పాటు బిజెపి జిల్లా కమిటీలో పోషిస్తూ పాత్ర పోషిస్తూ పని చేస్తున్నారు. స్రవంతి రెడ్డిని బిజెపి రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.
మరింత బాధ్యత పెరిగింది : స్రవంతి రెడ్డి
నాకు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడం అంటే నాకు పార్టీ బాధ్యతలు మరింత పెరిగాయని గుర్తించుకుంటానని అన్నారు. తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేసేందుకు తనవంతులకు కృషి చేస్తానని స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.