సీఎంసిలో సీఎస్ఐ జజ్జనకరా జనరే… నేడే సెమీ ఫైనల్ గేమ్… ముఖ్య అధికారుల సమావేశం… వేతనాలు అడిగితే బయటకు గెంటివేత… రూ. 20 వేలకు రూ. 8 వేలు మాత్రమే వేతనం… నాకేం తెలియదు అంటున్నా సీఎస్ఐ కార్యదర్శి… 5 రోజులు ఉచిత మెడికల్ క్యాంప్… 13న ఫైనల్ గేమ్… గెలుపు ఎవరిదో చూద్దాం…
సీఎంసిలో సీఎస్ఐ జజ్జనకరా జనరే…
నేడే సెమీ ఫైనల్ గేమ్…
ముఖ్య అధికారుల సమావేశం…
వేతనాలు అడిగితే బయటకు గెంటివేత…
రూ. 20 వేలకు రూ. 8 వేలు మాత్రమే వేతనం…
నాకేం తెలియదు అంటున్నా సీఎస్ఐ కార్యదర్శి…
5 రోజులు ఉచిత మెడికల్ క్యాంప్…
13న ఫైనల్ గేమ్… గెలుపు ఎవరిదో చూద్దాం…
(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో – వార్తటుడే )
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సిఎంసి మెడికల్ కాలేజీలో సీఎస్ఐ ప్రతినిధులు జజ్జనకర జనరే కార్యక్రమానికి పురుడుపోశారు. ఒకవైపు సీఎంసి మెడికల్ కాలేజ్ చైర్మన్ షణ్ముఖమహాలింగం మరోవైపు మాజీ డైరెక్టర్ మధ్య తగవు పెట్టి మెదక్ డయాసిస్ పేరుతో ఉచిత మెడికల్ క్యాంపు కొనసాగిస్తున్నారు. దీంతో ఇంతకు మెడికల్ కాలేజీలో ఏమి జరుగుతుంది అనేది అంతు చిక్కని ప్రశ్న. అయితే సీఎంసిలో సీఎస్ఐ కీలక ప్రతినిధులు సమావేశం చేసి సెమీ ఫైనల్ గేమ్ పూర్తి చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోవైపు మెదక్ డయాసిస్ పేరుతో మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం గమనార్హం. ఇదిలా ఉంటే మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని నిలదీసిన వారిని బయటకు గెంటి వేస్తున్నారు. మరి కొందరికి వేతనాలు ఇవ్వకుండానే ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం లేడు అని, డబ్బులు లేవు అని మరి బయటకు పంపుతున్నారు.

నేడే సెమీ ఫైనల్..
సీఎంసి మెడికల్ కాలేజీ వ్యవహారం ఎట్టకేలకు సెమీ ఫైనల్ కు వచ్చింది. ఏదైనా ఆటలో సెమీ ఫైనల్ ఘట్టలే కీలకం కదా. కొద్ది నెలలుగా సాగుతున్న సీఎంసి వివాదానికి తెర దించేందుకు సీఎస్ఐ ముఖ్య ప్రతినిధులు రంగంలోకి దిగారు. మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ తెర తీసిన ఈ వివాదాన్ని ముగించేందుకు సీఎస్ఐ డయాసిస్ పెద్దలు రగంలోకి దిగారు. బుధవారం సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే 2024 లోనే సీఎస్ఐ ట్రస్ట్ తమిళనాడుకు చెందిన షణ్ముఖమహాలింగంకు 36 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఆ తర్వాత పనులు మొదలు అయ్యాయి. షణ్ముఖమహాలింగం డైరెక్టర్ గా నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షులు అజ్జ శ్రీనివాస్ ను నియమించారు. కొద్ది రోజుల్లోనే వివాదం రావడంతో ఆయనని తొలగించారు. కానీ సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ హోదాలో దయానంద్ గౌరవ డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్ ను మళ్ళీ జూలై 30, 225న నియమించారు. ఇక్కడే అసలు చిక్కు మొదలు అయింది. ఒక్కరికి లీజుకు ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని గౌరవ డైరెక్టర్ గా నియమించడంతో వివాదం మొదలు అయింది. దీనిని వ్యతిరేకించిన ఛైర్మెన్ షణ్ముఖమహాలింగం మెడికల్ కాలేజీకి వెళితే అజ్జ శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇంతకీ అడ్డుకుంది సీఎస్ఐ వారా.? లేక అజ్జనా.? అనేది పక్కన పెడితే వివాదం మరింత ముదిరింది. ప్రార్ధనతో ప్రజల మేలు కోరి సేవలు చేసే సీఎస్ఐ సంస్థలో ఈ వివాదం జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి తెర దించేందుకు సీఎస్ఐ ప్రతినిధులు రంగంలోకి దిగి బుధవారం సమావేశం కానున్నారు.

వేతనాల కిరికిరి… తెలియదన్న ప్రతినిధి..
సీఎంసిలో సోకు ఒక్కడిది… సొమ్ము మరొకరిది అన్నట్లు పరిస్థితి తయారు అయింది. సీఎస్ఐ ప్రతినిధిగా వచ్చి మెడికల్ క్యాంపు ప్రారంభించిన ప్రతినిధిని కొందరు వేతనాలు అడిగారు. అవక్కు అయిన ఆయన “నాకేమి తెలియదు, మిమ్మల్ని పెట్టిన వారిని అడగండి” అని చెప్పడంతో సదరు వ్యక్తులు నివ్వేరపోయారు. కాలేజీ తెరిచింది ఒక్కరూ అయితే దానిని ఎంజాయ్ చేయాలని చూస్తుంది మరొకరు. 18 ఏళ్లకు తెరుచుకున్న సీఎంసి మెడికల్ కాలేజీ తెరుచుకోవడం చుట్టూ పక్కల వారు సంతోషంతో గంతులు వేసారు. చిన్నచితక పనుల కోసం సుమారు 50 మందికి పైగా పనుల్లో చేరారు. ఎలాగు ఉపాధి దొరికింది అనుకున్న రెండు నెలల్లో వేతనాలు లేక చుక్కలు చూసారు. డైరెక్టర్ హోదాలో వీరిని పనుల్లోకి తీసుకున్న వ్యక్తి వేతనాలు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఒకొక్కరికి ఆయా పనిని బట్టి వేతనాలు నిర్ణయించారు. ఇప్పుడు వివాదం రావడంతో ఎంతో కొంత చేతిలో పెట్టి పని లేదు ఏమి లేదు పొమ్మనుంటున్నారు. దీంతో పనిలో చేరిన వారు లాబోదిబొమంటున్నారు. ఒక పనిలో చేరిన వ్యక్తికీ రూ. 18 వేల వేతనం అని మూడు నెలల తర్వాత రూ. 8 వేల చొప్పున చేతిలో పెట్టి ఇంటికి పంపుతున్నారు. ఇప్పటికే 30 మందుకి పైగా కాలేజీ నడుస్తుందా లేదా తెలియక ఇంటి ముఖం పట్టారు.
జాగారం ఎందుకు.?
లీజుకి ఇచ్చింది వాస్తవం. మరోపక్క నియమించింది నిజం. కానీ చట్ట ప్రకారం లీజుకు తీసుకోని పనులు ప్రారంభించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తికి సీఎస్ఐలోని ఒక్కరిద్దరూ వ్యక్తులు మద్దతు పలకడం అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంలో ఏమైనా “డబ్బులు” చేతులు మారయా.? ఇంకా ఏదైనా కనిపించని “హస్తం” పని చేస్తుందా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు నెలలుగా సమస్యను పరిష్కారం చేయకుండా జాగారం చేయడంపై భిన్నభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క కొందరు నిజామాబాద్ నగరానికి చెందిన వైద్యులు మెడికల్ కాలేజీ ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉచిత మెడికల్ క్యాంప్ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ప్రచారం కూడా మొదలు అయింది. 18 ఏళ్లుగా దుమ్ము దూలపని సీఎస్ఐ మెడికల్ కాలేజీని తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి మొదలు పెట్టడం ఏమిటీ.? అది నడిస్తే మన పరిస్థితి ఏమిటీ.? అని పక్క ప్రణాళికతోనే మొదలు కాకుండా చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే సీఎస్ఐ ప్రతినిధులు సెమీ ఫైనల్ లో ఏమి చేస్తారో వేచి చూడాలి మరి.

అగని రాజీ ప్రయత్నాలు…
ఒకవైపు రాజీ ప్రయత్నం చేస్తూనే మరోవైపు సీఎంసీలో పట్టు కోసం ప్రయత్నాలు ఆగడం లేదు. కానీ కోట్ల రూపాయలతో వ్యవహారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు. అడుగు తీసి అడుగు వేస్తె లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న మెడికల్ కాలేజీపై కన్నేసిన పెద్దలకు కనువిప్పు అయిందేమో మరి. ఒకవైపు రాజీ కుదుర్చుకొని ఇచ్చిన డబ్బు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సీఎస్ఐ పెద్దల అండ ఉంది, అంతా నాదే రాజ్యం అంటూ కొత్త సోకులకి రంగులు అద్దుతున్నారు. ఇప్పటికే రెండు వైపుల నుంచి రాజీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ షణ్ముఖ మహాలింగం దొరకాక పోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. పెట్టింది ఇస్తే చాలు వెళ్ళిపోతాం అంటూనే మరోపక్క ఇక ఎవరురారు మేమే మెడికల్ కాలేజీ నడిపిస్తామని చెప్పుకోవడం విశేషం.”చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా ” అన్నదట చీమ. అవును మరి దాని పుట్టలో పెడితే చీమ ఉరుకుంటుందా.? 18 ఏళ్లుగా మూసి ఉంచిన కాలేజీని తెరిపించిన వ్యక్తి కుర్చీకే ఎసరు పెడితే ఎలా ఉంటుంది. చీమ కథలా ఉండదా.? రూ. 2 కోట్లు ముంచారు, పరారి అయ్యారు అని చెపుతూనే నాకే సీఎస్ఐ పవర్ ఇచ్చింది అంటే కథ మరోలా లేదు.
13న సీఎంసి ఫైనల్…
ఈనెల 13న సీఎంసీ మెడికల్ కాలేజీ వ్యవహారం ఫైనల్ కానుంది. అందుకు ఢిల్లీలో మకాం వేసిన షణ్ముఖమహాలింగం ఫైనల్ గేమ్ కు సిద్ధం చేసారు. ఇప్పటికే ఢిల్లీలో మెడికల్ కౌన్సిల్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులను కలిసారు. ఇప్పటికే రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతధికారులతో పాటు ప్రభుత్వ పేదలకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందుకు ఈనెల 13న ఫైనల్ గేమ్ కు ఏర్పాట్లు జరుగుతున్నయానే సమాచారం ఉంది. ఇంతలోనే సీఎస్ఐ పెద్దలు ఫైనల్ చేస్తారా.? లేక పంచాయతీ రాజధాని చేరి ఫైనల్ లో ముగుస్తుందా.? వేచి చూడాలి.