అవంచనియ సంఘటనలకు తవివ్వొద్దు…
ప్రశాంతంగా నిమజ్జనం చేయాలి…
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్….
కామారెడ్డి, వార్తటుడే, సెప్టెంబర్ 02 :
ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తో కలిసి గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న టేక్రియాల్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణమును అనుకొని ఉన్న టేక్రియల్ చెరువులో గణేష్ నిమజ్జనం సందర్భంగా దాదాపు 700 లకు పైగా గణేషులను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నదని ఆ రద్దిని దృష్టిలో పెట్టుకొని గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆపస్థితి కలగకుండా టేక్రియాల్ చెరువు వద్ద ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. చెరువులోకి ఎవరు పడితే వారు వెళ్లకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, గణేష్ లను నీళ్లలో వేయడానికి పెద్ద క్రేను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్రూఫ్ షామియానా ఏర్పాటుచేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఫిషరీస్ ఫైర్ తదితర శాఖలచే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని

గణేష్ లకు తగలకుండా విద్యుత్ వైర్లను పైకి పెంచాలని, విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయాలన్నారు. చెరుకు వచ్చే రహదారికి మరమ్మత్తు చేసి సిద్ధం చేయాలని, ఈనెల 4, 5, 6 తేదీలలో అధిక సంఖ్యలో వినాయకులు వస్తాయి కాబట్టి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వరుస క్రమంలో నాయకులను నీళ్లలో వేసేలా పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీవో, తాసిల్దార్, పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి ఆర్డిఓ వీణ, తాసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, ఫిషరీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం టేక్రియాల్ లో వినాయకులు వచ్చే రహదారిని పరిశీలించారు.