నరకాసుర* నాటకంలో రాజులెవరు.? రాబందులెవరు.? వసూళ్ళు నిజమే, కానీ చేసిందెవరు… నాటకంలో విలన్ ఎవరు.? అప్పులపాలు చేసిన నాటకం… నరకాసుర కొత్త నాటకం హిట్టా.? ఫట్టా.?

*నరకాసుర* నాటకంలో
రాజులెవరు.? రాబందులెవరు.?

వసూళ్ళు నిజమే, కానీ చేసిందెవరు…

నాటకంలో విలన్ ఎవరు.?

అప్పులపాలు చేసిన నాటకం…

నరకాసుర కొత్త నాటకం హిట్టా.? ఫట్టా.?

(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో – వార్తటుడే)

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సీఎంసి మెడికల్ కాలేజ్ లో నరకాసుర నాటకం కొనసాగుతుంది. ఈ నాటకంలో రాజులెవరో.? రాబందులెవరో.? ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. ఇంతకు అసలు నరకాసుర ఎవరు.? నాటకం ఏమిటీ.? అనుకుంటున్నారా.? అయితే మీ అనుమానాలు తీరాలంటే ఈ కథ, కథనం చదవాలి. చదవండి మరి.

అనగనగా ఆయన కథ..?

అనగనగా ఆయన వైద్య రంగంలో సేవకుడు. పవిత్రమైన వైద్యవిద్యా చదువు కోసం నేపాల్ వెళ్ళాడు.అక్కడి నుంచి నిజామాబాద్ వచ్చాడు. కానీ స్థానికంగా నేపాల్ చదువు (ఎంబిబిఎస్) ఇక్కడ చెల్లకపోవడంతో తిరిగి ముంబయి వెళ్లి మరో వైద్య చదువు (డిసిహెచ్ఎస్) చదివాడు. ఆ తర్వాత నిజామాబాద్ తిరిగి వచ్చి తన వైద్య సేవలు మొదలు పెట్టాడు. ఇంతకు అయన వైద్యుడా కాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యంలోనే మరో విభాగంలో ఉన్న ఆయన సతీమణి సైతం వైద్య సేవలు మొదలు పెట్టారు. ఇద్దరు కలిసి సేవలు అందిస్తూ సంపాదిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న ఆ తర్వాత సదరు వైద్యుడికి కొత్త కోరిక పుట్టింది. అదే కోరిక *నరకాసుర* నాటకానికి తెర తీసారు. ఇందులో తానే హీరో కావాలని అనుకున్నారు. కానీ నాటకానికి పెట్టుబడి పెట్టేవారు నిరాకరించడంతో వెనకడుగు వేశారు. ఇంకేముంది ఆ నాటకం కొనసాగెందుకు సదరు వైద్యుడు నిర్మాత (పెట్టుబడిదారుడు)గా అవతారం ఎత్తాడు. ఇలా *నరకాసుర* సినిమా నాటకం మొదలు అయింది. కథ నిర్మాణం పూర్తి అయింది. సినిమా ప్రజల్లోకి వచ్చింది. కథ ఫేయిల్ అయింది, కథ కంచికి చేరింది. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.? ఇక్కడే *నరకాసుర* కొత్త నాటకం మొదలు అయింది. ఈ నాటకం ఫల్టీ కొట్టడంతో రూ.6 కోట్లకు పైగా అప్పుల పాలు చేసింది ఈ కథ. ఈ నాటకం తెర మీదకు తెచ్చేందుకు సాటి వైద్యుల నుంచి అప్పుల రూపంలో వసూళ్ళకు పాల్పడ్డారు. కథ కంచికి పోగానే అప్పులు ఇచ్చిన వైద్యులు సదరు వైద్యుని నుంచి వసూళ్ళు చేసుకునే పనిలో పడ్డారు. దింతో ఖలీల్వాడిలో ఉన్న స్థలాన్ని అమ్మి కొందరికి అప్పులు కట్టారు. మిగిలిన కొందరు తమ డబ్బులు వసూల్ చేసుకునే పనిలో పడ్డారు. ఇంతలోనే సీఎంసి మెడికల్ కళాశాల ప్రారంభం విషయం ఐఎంఏ దృష్టిలో పడింది. దానికి నాయకుడు అయినా సదరు వైద్యుడు సీఎంసిలో సేవకుడిగా చేరి అతి తక్కువ కాలంలోనే సామంతరాజు అయ్యాడు. ఇక సామంతరాజు సీఎంసిలో ఎలాంటి రాజరికం వెలగబెట్టారో ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తుంది. మరో నలుగురిని (వారూ వైద్యులే) కలుపుకొని కొత్త నాటకానికి పునాది వేసారు. ఆ నాటకమే నరకాసుర.


ఆ *నరకాసుర సినిమా నాటకమే* సీఎంసి మెడికల్ కాలేజ్ లో కొత్త రూపం దాల్చింది.అప్పట్లో హైదరాబాద్ లో మొదలైన నరకాసుర నాటకం బెడిసికొడితే తిరిగి అదే నాటకం మరో రూపంలో డిచ్పల్లికి చేరింది.

చెల్లని పత్రం… అందని ఉద్యోగం…

వైద్య చదువు పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టిన వైద్యుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (జీఎంసి), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో సేవలు అందించాలని ప్రయత్నించారు. కానీ అక్కడి అధికారులు స్టడీ పత్రాలను చూసి నిరాకరించారు. అయినప్పటికీ తన పలుకుబడి ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దింతో చేసేదేమి లేక వెనకడుగు వేసి ప్రాక్టీస్ కొనసాగించారు. అటు నుంచి నాటక (సినిమా) రంగంపై కన్నెశారు. అక్కడ *నరకాసుర* నాటకం *చేయి* ఇవ్వడంతో తిరిగి నిజామాబాద్ కు చేరింది. అంతలోనే వైద్యుల సంఘం ఎన్నికలు రావడం, కొందరు వైద్యుల మద్దతు దొరకడంతో ఆ సంఘానికి నాయకుడు అయ్యాడు. ఆలా వచ్చిన అవకాశంతో *నరకాసుర* నాటకం తిరిగి తిరిగి సీఎంసిలోకి అడుగు పెట్టింది. ఇంకేముంది, నరకాసుర సైతం ఇక్కడ సామంతరాజు అయ్యాడు. ఇక సామంతరాజు కథ ఇప్పుడు దారవాహిక సీరియల్ గా మారింది. ముగింపు ఎలా ఉంటుందో చూద్దాం.

అంత ప్లాన్ ప్రకారమే…

నేపాల్ నుంచి చెల్లని పత్రంతో వయా ముoబాయి ద్వారా నిజామాబాద్ చేరుకున్నాడు ఆ వైద్యుడు. ఆలా పట్నంలో నరకాసుర నాటకం నుంచి మొదలై డిచ్పల్లిలో సామంతరాజు వరకు వచ్చారు. ఇక్కడ మహారాజు ఫిఠానికి ఎసరు పెట్టారు.పక్క ప్లాన్ వేసుకొని ముందస్తుగానే పావులు కదిపారు. ఇలా ఎన్నిసార్లు ప్లాన్ వేసినా వైద్యుడికి బెడిసికొడుతోంది. ప్రస్తుతం నామమాత్రంగా సామంతరాజుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇదంతా ఆలస్యంగా తెలుసుకున్న మహారాజు సైతం తన కొత్త సైన్యంతో రంగంలోకి దిగారు. ఇక్కడ కూడా త్వరలో కథ సుఖాంతం కానుంది. పాపపు పాండవులు అంతా ప్లాన్ ప్రకారం చేసిన *నరకాసుర* హిట్టా.? ఫట్టా.? చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.