భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై ముత్యాల రమ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై ముత్యాల రమ

ఎడపల్లి ఆగస్ట్ 14

మూడు రోజులపాటు బారీ వర్షాలు ఉన్నందున మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ అన్నారు. జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు, అలాగే వాతావరణ కేంద్రం సూచన ప్రకారంగా 72 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున, గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు యువకులు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. పురాతన నివాసపు ఇండ్లలో ఉండకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో బాగoగా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నట్లయితే అందులో ఉండేందుకు స్థానిక గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సంబంధిత అధికారులు అవకాశాలు కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారీగా వర్షాలు కురిసినట్లయితే చిన్నారులు యువకులు పెద్దలు పురాతన ఇండ్ల వద్ద కానీ చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ముత్యాల రమ సూచించారు

Leave A Reply

Your email address will not be published.