తెలంగాణ అధ్యక్షుని ఎంపికపై జగన్ దృష్టి
పలువురి పేర్లు పరిశీలనలో
త్వరలో అధ్యక్షుని ప్రకటన
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులుగా తజాముల్.?
హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 15 :
తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతకు రానుంది. ఇప్పటికే పార్టీ అధినేత పలువురి పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత జగన్ తెలంగాణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత గట్టు శ్రీకాంత్ రెడ్డిలు కొనసాగారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి మంత్రి కాగా శ్రీకాంత్ రెడ్డి బిజెపి లో చేరారు. దింతో గత కొంత కాలంగా పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అలాగే బిఆరెస్ తో కేసీఆర్ తో ఉన్న సత్సంబంధాల వల్ల జగన్ తెలంగాణ వైపు నామ మాత్రంగా పని చేసారు. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఆలయన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్సీపీ జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ కోణంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా జగన్ ఉండగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ప్రతి ప్రెస్ మీట్ లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వైఫల్యలపై విరుచుకు పడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షులుగా తజాముల్ హుస్సేన్.?
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా పని చేసిన తజామూల్ హుస్సేన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన తజాముల్ హుస్సేన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గా ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గా తజాముల్ హుస్సేన్ ఎంపిక కావడం ఖాయం అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.