గిరిజన బిడ్డకు టీసైడ్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్ పట్టా
నిజామాబాద్ వార్తటుడే మే 21
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లి గిరిజన తండా కు చెందిన చిన్ని కృష్ణ రాథోడ్ నిన్న రాత్రి యూకే లోని టీసైడ్ విశ్వవిద్యాలయం నుండి ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ ఎమ్మెస్ పట్టా పొందడం జరిగింది. మీరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థి దశ నుండి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లి పట్ట పొందడం గౌరవంగా ఉందని తల్లిదండ్రులు వాపోయారు. ఇట్టి ఆనందం చెప్పుకోలేనిదని, క్రమశిక్షణతో చదివి ఇంత పెద్ద ఎదగడం గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా గిరిజన తండా ప్రజలు పట్టా పొందిన విద్యార్థితోపాటు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి లాల్ నాయక్ కుటుంబ సభ్యులను అభినందించారు.తన గిరిజన తండాలో పెరిగి యూకే లో పట్టపొండడం గిరిజన తండాకు ఎంతో గర్వకారణం అన్నారు. రానున్న రోజులలో తండాలో యువతి యువకులు తండాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.