రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఏకార్ పాషా నియామకం.

రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఏకార్ పాషా నియామకం.

రెంజల్,జూన్ 17

నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి ఈసెపల్లి మహేష్ ఆధ్వర్యంలో నిజామబాద్ జిల్లా ఉపసర్పంచ్ల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్,లక్కీ రెడ్డి, కమలాకర్ రెడ్డి,సమావేశానికి

హాజరై ముందుగా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, నివాళులార్పించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు.సమావేశం అనంతరం నిజామాబాద్ జిల్లా నుండి ఏకార్ పాషాను రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులు గా నియమించారు. ఈ సందర్బంగా ఏకార్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకం తో పెద్ద బాధ్యత ను అప్పజేప్పినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉప సర్పంచుల సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా లోని అన్ని గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.

Ekar Pasha appointed as Vice President of the State Sub-Sarpanch Forum.
Comments (0)
Add Comment