కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీయండి
డిచ్పల్లి వార్త టుడే
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, హామీలను గాలికి వదిలేసి.. ఏం ఉద్దరించారని గ్రామసభలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న ప్రశ్నించారు. గ్రామసభల్లో బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఆరు గ్యారం టీలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఈ సందర్భంగా భూమన్న మాట్లాడుతూ… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీ టీసీ అత్యధిక స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అందుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, ఇతర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, నాయకులు వెంకటరమణ, వినోద్, సురేష్, రవి, లక్ష్మణ్, విఠల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.