విద్యా సంస్థలకు నేడు సెలవు… నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

 విద్యా సంస్థలకు నేడు సెలవు

కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ కలెక్టరేట్, వార్తటుడే, ఆగస్టు 28 :

భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం (28.08.2025) సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.

విద్యా సంస్థలకు నేడు సెలవు .... కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
Comments (0)
Add Comment