తీరం దాటిన అల్పపీడనం… మూడు గంటల్లో భారీ వర్షాలు…

తీరం దాటిన అల్పపీడనం…

మూడు గంటల్లో భారీ వర్షాలు…

హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 28 :

ఒడిశా దగ్గర అల్పపీడనం తీరం దాటింది. దీంతో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది. హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎక్కడిక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

తీరం దాటిన అల్పపీడనం... మూడు గంటల్లో భారీ వర్షాలు...
Comments (0)
Add Comment