రూ.40 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు… ఓ దంపతులకు జరిగిన మోసం… ₹40 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు…

రూ.40 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు…

ఓ దంపతులకు జరిగిన మోసం…

₹40 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు…

నిజామాబాద్ క్రైం, వార్తటుడే, సెప్టెంబర్ 5 :

నిజామాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఆగడం లేదు. ఇటీవల టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వృద్ధులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడ్డారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల హనుమాన్ జంక్షన్ వద్ద నివాసముంటున్న ఓ దంపతుల వద్ద నుంచి ఏకంగా ₹40 లక్షలు కాజేసిన ఘటన కలకలం రేపింది.5 గంటల పాటు దంపతులను వేదించి, 40 లక్షలు వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నామని ఆలస్యంగా గుర్తించిన దంపతులు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన వృద్ధులనే కాకుండా, సాధారణ ప్రజలను కూడా భయాందోళనకు గురిచేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ : రూ.40 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు... ఓ దంపతులకు జరిగిన మోసం... ₹40 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు...
Comments (0)
Add Comment