పివిఆర్ కు మాత ప్రసాదం అందజేసిన ఆలయ కమిటీ…
ఆర్మూర్, వార్తటుడే, అక్టోబర్ 7 :
ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ చైర్మన్ రేగుల సత్యనారాయణ గారు మరియు ఆలయ ప్రధానార్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి విజయకుమార్ రెడ్డి గారికి విజయదశమి సందర్భంగా వేద పండితుల సమక్షంలో అమ్మవారి ప్రసాదాన్ని PVR భవన్ లో అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లకి అభినందనలతో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం మరింత ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు గాని దీవి దేవీ నవరాత్రి ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గాని ఆర్మూర్ పట్టణం నుండి గాని చాలా పెద్ద ఎత్తున మహిళా మణులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా జరగాలని ఆలయ అభివృద్ధికి నిధులు గాని ఎలాంటి చేయూతగాని రేవంతన్న ప్రభుత్వం తరఫున ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది…..
ఈ కార్యక్రమంలో రేగుల సత్యనారాయణ గారు మరియు ఆలయ ప్రధానార్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్మూర్ ని
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ గారు, AMC డైరెక్టర్ వాసు గారు, భూపేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.