ఇదేమి వాన ఇదేమి వరద… భయం గుప్పిట్లో మంజీరా పరివాహక ప్రజలు… పొంగి పొర్లుతున్న వాగులు…

ఇదేమి వాన ఇదేమి వరద…

భయం గుప్పిట్లో మంజీరా పరివాహక ప్రజలు

పిట్లం, వార్తటుడే, ఆగస్టు 28 :

నిన్నటి నుండి భారీగా కురుస్తున్న
కుండపోత వర్షానికి.మంజీరా నదిపై ఉన్న సింగూరు,నల్లవాగు,కాకివాగు,
కళ్యాణి ప్రాజెక్ట్,సింగీతం రిజర్వాయర్,పోచారం ప్రాజెక్ట్, పైనుండి ఎక్కువగా వరదనీరు రావడంతో దీనికి తోడు ప్రధానమైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి 1,50,000 పైచిలుకు మంజీరా గుండా ప్రవహిస్తుంటే పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టొకొని భయం గుప్పిట్లో ఉన్నారు..అయితే గత ముడు సంవత్సరాల క్రితం పిట్లం మండలం కుర్తి గ్రామానికి హైలెవల్ వంతెన నిర్మించారు…అందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్త పరిచారు. ప్రస్తుతం ఆ హైలెవల్ వంతెన పైనుండి మంజీరా ప్రవహిస్తుంటే భయం తో ప్రజలు అల్లాడి పోతున్నారు..ఇలాంటి వరద గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదు అని గ్రామస్తులు అన్నారు…
వర్షాకాలం పూర్తి అయ్యేవరకు ఇంకా ఎం జరుగుతదో అని ప్రజలు ఆవేదన చెందారు…
గంగమ్మ తల్లి శాంతించు అంటూ మహిళలు దెవుణ్ణి వేడుకున్నారు…

పొంగి పొర్లుతున్న వాగులు... భయం గుప్పిట్లో పిట్లం ప్రజలు...
Comments (0)
Add Comment