ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…
ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్…
డిచ్‌పల్లి, వార్తటుడే, అక్టోబర్ 16 :
డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో డిచ్‌పల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు డిచ్‌పల్లి పిఎసిఎస్ చైర్మన్ రామ్ చందర్గౌడ్ ఘన్పూర్, నడిపల్లి ఖిల్లాడిచ్‌పల్లి, దూస్ గాం, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఆయనతోపాటు పిఎసిఎస్ డైరెక్టర్లు సతీష్ రెడ్డి, గంగారెడ్డి, సాయిలు ,నరసింహారెడ్డి, ఏగొండ,రాయలింగం, చందర్ నాయక్, రామ రాజు, సాంసంగ్, సుందర్, లక్ష్మణ్ , మాణిక్యం, రాయా అశోక్ దేవి సింగ్.రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు పిఎసిఎస్ పరిధిలోని అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రైతులకు చిన్న పాటి లోటు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తామని, రైతు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం మద్దతు ధర , గ్రేడ్ ఏ 2,389 రూపాయలు గ్రేడ్ బి 2,369 రూపాయలు నమోదు చేసిందని దీని ప్రకారం వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని రామ్ చందర్ గౌడ్ పేర్కొన్నారు.