పిసిసికి ఏడాది పూర్తి… మహేశన్న విదేతీయతకు పట్టం… సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు… జిల్లా నుంచి రెండో రాజకీయ శక్తి మహేష్ కుమార్… విద్యార్ధి దశ నుంచే రాజకీయాలు… పిసిసిగా మహేశన్న ఏడాది ప్రస్థానం…

పిసిసికి ఏడాది పూర్తి…

మహేశన్న విదేతీయతకు పట్టం…

సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు…

జిల్లా నుంచి రెండో రాజకీయ శక్తి మహేష్ కుమార్…

విద్యార్ధి దశ నుంచే రాజకీయాలు…

పిసిసిగా మహేశన్న ఏడాది ప్రస్థానం…

(నిజామాబాద్ బ్యూరో – వార్తటుడే)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి పిసిసి ) అధ్యక్షులు గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి అవుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విద్యార్ధి దశ నుంచే క్రియశీల రాజకీయాల్లో ఉన్నారు. 2024 సెప్టెంబర్ 6న ఎఐసిసి మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి అధ్యక్షులుగా ప్రకటించింది. సెప్టెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షులుగా నియామకం అయి ఏడాది పూర్తి కావడంతో ఆయన అనుచరులు, జిల్లాలోని నాయకులు సంబరాలు చేసుకింటున్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.

నేపథ్యం…

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మారుమూల గ్రామం రహత్ నగర్ లో 1966 ఫిబ్రవరి 24న గంగాధర్, మన్నేమ్మలకు జన్మించారు. భార్య సంధ్యారాణి, పిల్లలు రీత్విక్ గౌడ్, ప్రణవ్ గౌడ్ లు ఉన్నారు. జిల్లాలోనే డిగ్రీ వరకు విద్యాబ్యాసం కొనసాగింది. విద్యార్ధి దశ నుంచే రాజకీయాలలో చురుక్కుగా పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఎన్ఎస్యుఐలోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ బి. కామ్ చదువుతూ రాజకీయాలకు ఆకర్షితులు అయ్యారు.

రాజకీయ అడుగులు…

కాంగ్రెస్ ఇందిరా గాంధీ ఆదర్శముగా తీసుకోని ఎన్ఎస్యుఐ లో పని చేసారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అలాగే యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేసారు. మొదటి నుంచి గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు నేర్పుతు కాంగ్రెస్ లో పని చేసారు. జిల్లా నుంచి కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఎదిగిన డి. శ్రీనివాస్ కు రాజకీయ శిష్యుడిగా రాజకీయాల్లో కొనసాగారు. కానీ అనతికాలంలోనే డి. శ్రీనివాస్ కు దూరంగా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1994 లో డిచ్ పల్లి అసెంబ్లీ కి పోటీ చేసి తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసారు. 2013-14 లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ గా పని చేసారు. 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పిసిసి కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2018లో రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా కొనసాగారు. జూన్ 26, 2021న టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులుగా, డిసెంబర్ 10, 2022న జాతీయ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక అయ్యారు. జూన్ 20, 2023న టిపిసిసి ఎన్నికల కమిటీ సభ్యులుగా ఉన్నారు. జూన్ 29, 2024న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. జూన్ 31న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసారు. సెప్టెంబర్ 6, 2024న ఎఐసిసి మహేష్ కుమార్ గౌడ్ ను టిపిసిసి అధ్యక్షులుగా నియమించింది. అదే నెల 15న పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి భాద్యతలు చేపట్టారు.

ఎన్నికల్లో కీలకం…

2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ క్రియాశీలకంగా పని చేసారు. ఎన్నికల కమిటీ సభ్యులుగా పని చేస్తూ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి తోడుగా నిలబడి తనసత్తా చూపించారు. అదే నమ్మకంతో పని చేసారు. పార్టీకి విధేయుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు తదుపరి పిసిసి అధ్యక్షులుగా పార్టీ అవకాశం కల్పించింది. జిల్లా నుంచి డి. శ్రీనివాస్ తర్వాత అంతటి కీలక పాత్ర పోషించడంలో ముందు ఉన్నారు.

Comments (1)
Add Comment