తిరుమల నర్సింగ్ విద్యాసంస్థల్లో ఘనంగా ఓనం పండుగ… ఓనం వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి… 

తిరుమల నర్సింగ్ విద్యాసంస్థల్లో ఘనంగా ఓనం పండుగ

ఓనం వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

డిచ్‌పల్లి వార్తటుడే సెప్టెంబర్ 4

డిచ్ పల్లి మండలం నడిపల్లి శివారులోని బర్దిపూర్ తిరుమల నర్సింగ్ కళాశాలలో ఘనంగా ఓనం పండుగ నిర్వహించినారు. కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే పర్వదినాలలో ఇది ఒకటి. వితరణ శీలి, ప్రజానురంజక పాలకుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ సందర్భంగా తిరుమల నర్సింగ్ కళాశాలలో కేరళ యువతి యువకులు కేరళ నృత్యం చేస్తూ సరదాగా గడిపారు. ముఖ్య అతిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి విభిన్న సంస్కృతి సంప్రదాయలకు..ప్రకృతి అందాలకు నీలవైన కేరళ రాష్ట్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో పాటుగా వేషధారణలతో ఆకట్టుకునే కేరళీయులకు అతిపెద్ద పండుగ ఓనం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు.


పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలా పరిపాలించిన బలిచక్రవర్తి.. తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగివచ్చిన రోజుగా ఓనం పండుగను భావించి కేరళ వాసులు ఓనం జరుపుకుటరని నర్సింగ్ కళాశాల ఛైర్మన్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు….కళాశాలలో 300 మందికి పైగా కేరళ విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారు.. వారి సంప్రదాయ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామని చైర్మన్ తెలిపారు….

ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మ రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి, డాక్టర్ వినీల్ రెడ్డి, బ్లాక్. కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గంగాధర్, మునిపల్లి సాయిరెడ్డి, శాంసన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల నర్సింగ్ విద్యాసంస్థల్లో ఘనంగా ఓనం పండుగ... ఓనం వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి...
Comments (0)
Add Comment