వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి మండవ
నిజామాబాద్ రూరల్, వార్తటుడే, ఆగస్టు 31 :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వరద బాధితుల కోసం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆదివారం పర్యటించారు.
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను, రోడ్లను, చెరువులు, కాలువలను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులకు, ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వం నుంచి వెంటనే సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిరికొండ గోపి, పుప్పాల రవి, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.