సీఎంసీ కథ కొత్త మలుపు…
మీడియా కు స్పందించని కన్వీనర్
పోలీసులను వ్యవధి కోరిన వైనం…
ఛైర్మెన్ ను ఆసుపత్రి కి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ…
పోలీసుల జోక్యంతో వాయిదా
(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో- వార్తటుడే)
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని సీఎంసి మెడికల్ కాలేజ్ వ్యవహారం మళ్ళీ కొత్త మలుపు తిరిగింది. ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగంను లోపలికి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దింతో ఛైర్మెన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. సిబ్బంది నివరించడంతో 100 కు ఫోన్ చేసారు. పోలీసులు వివాదం జరగకుండా చైర్మన్ ను నచ్చజెప్పి పంపించారు. అయితే ఈ వివాదానికి కారణం అయిన సిఎస్ఐ బోర్డు కన్వీనర్ దయానంద్ వ్యవహారం అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు కొంత టైం కావాలని పోలీసులు సూచించడంతో ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారం ఇంకెంత కాలం కొనసాగుతుందో వేచి చూడాలి.
ఎందుకు ఇలా.?
ఒకవైపు సీఎస్ఐ, మరోవైపు పోలీసులు ఎడతెగని పంచాయతీల మారింది. ఇటు సీఎస్ఐతో 36 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్న షణ్ముఖ మహాలింగం చైర్మన్ గా ఉన్నారు. ఛైర్మెన్ హోదాలో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ ను డైరెక్టర్ గా నియమించారు. అనివార్యంగా శ్రీనివాస్ ను తొలగించారు. కానీ అదే అజ్జ శ్రీనివాస్ ను సీఎస్ఐ బోర్డు కన్వీనర్ గౌరవ డైరెక్టర్ గా నియమించారు. ఇలా మెడికల్ కాలేజ్ నుంచి ఛైర్మెన్ ను తొలగించారని, నేనే నిర్వహిస్తున్నని శ్రీనివాస్ చెపుతున్నారు. కానీ అధికారికంగా అగ్రిమెంట్ చేసుకున్న షణ్ముఖ మహాలింగం పూర్తి హక్కులు తనవెనని బలవంతంగా, ఒక్కడిని చూసి నన్ను, కొత్త డైరెక్టర్ ను లోపలికి రానివ్వడం లేదని చేబుతున్నారు. అయితే ఈ పంచాయతీ పోలీసుల చెంతకు చేరింది. లాండ్ ఆర్డర్ సమస్యగా చూపి పోలీసులు షణ్ముఖ మహాలింగంను మెడికల్ కాలేజీకి వెళ్ళవద్దని చెపుతున్నారు.
లాజిక్ తో లాడాయి…
ఒకవైపు ఒప్పందం చేసుకొని మెడికల్ కాలేజ్ తెరిచిన షణ్ముఖ మహాలింగం ఉండగా మరోవైపు సీఎస్ఐ గౌరవ డైరెక్టర్ గా నియమించిన వ్యక్తికీ నిబంధనల మేరకు ఎలా హక్కులు వర్తిస్తాయానేది ఇక్కడ కొత్త ప్రశ్న తలెత్తుతుంది. చట్ట ప్రకారం ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ నిబంధనల మేరకు కొనసాగినప్పుడు ఇతర వ్యక్తులను భాగస్వాములను చేయడం ఎంత వరకు సమంజసం. ఇది పోలీసులు ఏ కోణంలో చూస్తున్నారనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఒకవైపు మాత్రం సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కానీ ఇక్కడ సీఎస్ఐ వారి సూచన మేరకే పని చేస్తామని పోలీసులు చెప్పడం నివ్వేరపరుస్తుంది. డబ్బులు తీసుకోని 2024లో లీజు అగ్రిమెంట్ చేసిన వారు చట్టం ప్రకారం హక్కుదారు అవుతారా.? లేక జూలై 30న ఒక డైరెక్టర్ హోదాలో చేరి ఉద్యోగం చేసే వ్యక్తి హక్కుదారు అవుతారా.? అనేది అర్ధం చేసుకోవాలి. నిబంధనల ప్రకారం చేసే అగ్రిమెట్లకు హక్కులు లేకపోతే చట్టం ఎటు పోతుందో మరి. ఇలా లాజిక్ తో లాడాయి చేయిస్తున్నారనేది బహిరంగ చర్చ జరుగుతుంది.
మౌనం వీడని కన్వీనర్…
2024 లో సీఎస్ఐ కమిటీ షణ్ముఖ మహాలింగంకు లీజు అగ్రిమెంట్ చేసింది. అగ్రిమెంట్ ప్రకారం వారు పనులు మొదలు పెట్టుకున్నారు. కానీ కమిటీలో కన్వీనర్ అయిన దయానంద్ శ్రీనివాస్ ను గౌరవ డైరెక్టర్ గా నియమించారు. అయితే ఈ విషయం అయి దయానంద్ ను ఎన్నిసార్లు సంప్రదించే ప్రయత్నం చేసిన స్పందించడం లేదు. కానీ పోలీసులకు మాత్రం స్పందించి సమాధానం చెప్పినట్లు తెలిసింది. సోమవారం వరకు గడువు కోరినట్లు సమాచారం. అయితే మీడియా ప్రతినిధులకు ఎవరికీ కన్వీనర్ దయానంద్ సమాధానం చెప్పకపోవడంపై అనుమానం వ్యక్తం అవుతుంది.
ఢిల్లీకి వెళ్లిన షణ్ముఖ మహాలింగం…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సీఎస్ఐ మెడికల్ కాలేజ్ విషయంలో తనను ఏకాకిని చేసి మోసం చేస్తున్నారని దీనిపై మెడికల్ కౌన్సిల్ కు, సంబందిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్ల తెలిపారు. కొందరితో చేతులు కలిపి నాపై తప్పుడు ప్రచారం చేస్తూ అజ్జ శ్రీనివాస్ పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. లీగల్ గా తనకు అన్ని హక్కులు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే పోలీసులకు అన్ని వివరాలు ఇచ్చిన అజ్జ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడం లో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేంద్ర సర్వీసులో పని చేసానని, చట్టంపై నమ్మకం ఉందని అన్నారు. చట్ట ప్రకారంగానే మెడికల్ కాలేజీలో అడుగు పెడతానని అన్నారు.