నేపాల్ లో చిక్కుకున్న పౌరుల కోసం ప్రత్యేక సెల్… తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు… మంత్రి జూపల్లి కృష్ణారావు…

నేపాల్ లో చిక్కుకున్న పౌరుల కోసం ప్రత్యేక సెల్…

తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు…

మంత్రి జూపల్లి కృష్ణారావు…

హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 10 :

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల తక్షణ సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రజల భద్రతే ప్రాధాన్యంగా కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో తెలంగా ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తున్నదని చెప్పారు.

హింస నేపథ్యంలో నేపాల్‌లో ఉన్న తెలంగాణ పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ పర్యాటకులకు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని మంత్రి ‌ భరోసా ఇచ్చారు. ఇదే అంశంపై న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ తో మంత్రి జూపల్లి ఫోన్ లో మాట్లాడారు. పర్యాటకం నిమిత్తం నేపాల్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ రాష్ట్ర పౌరుల సహాయార్థం తెలంగాణ భవన్ లో సహాయం కోసం తెలంగాణ భవన్ లోని అధికారులను ఈ నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.
📞 +91 9871999044.
📞 +91 9643723157.
📞 +91 9949351270.

నేపాల్ లో చిక్కుకున్న పౌరుల కోసం ప్రత్యేక సెల్... తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు... మంత్రి జూపల్లి కృష్ణారావు...
Comments (0)
Add Comment