ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ.

ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ.

ఎడపల్లి ఆగస్ట్ 27(వార్తటుడే)

పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ముత్యాల రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయకుల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని దానివల్ల అనేక దుష్పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన వినాయకులను మాత్రమే పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అంతేకాకుండా వినాయక మండపాల వద్ద ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె చేతుల మీదుగా స్థానికులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కా రెడ్డి, స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరిక రాజలింగం, ఉపాధ్యక్షులు నరసింహారాజు, సత్యనారాయణ స్వామి, జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి శంకర్, కార్యదర్శులు రాధా మేర్సి, బేబీ రాణి, గంగమని, స్థానిక నాయకులు ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, కందగట్ల రామ్ చందర్, రెడ్డి, సూర్యనారాయణ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ.
Comments (0)
Add Comment