ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్, వార్తటుడే, ఆగస్టు 15 :

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండా ఆవిష్కరించారు.
ఇటీవల జర్నలిస్టు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ & బిల్డర్స్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మధు బహుమతులు అందజేశారు
నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలతో ఒత్తిడులు దూరం అవుతాయని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మధు అన్నారు.జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
జర్నలిస్టులు పాల్గొన్నారు.

జాతీయ జండాకు వందనం చేస్తున్న జర్నలిస్టులు
Comments (0)
Add Comment