దేశం గర్వించదగిన గిరిజన నేత శిబుసోరెన్ : సీఎం రేవంత్ రెడ్డి, జార్ఖండ్ లో నివాళులు అర్పించిన సీఎం…

దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఘనంగా నివాళులర్పించారు. శిబుసోరెన్ స్వంత గ్రామం జార్ఖండ్‌ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన దిషోం గురు శ్రద్ధాంజలి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబుసోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. శిబు సోరెన్ గారు జార్ఖండ్ కు మాత్రమే కాకుండా దేశంలోని గిరిజన, అణగారిన వర్గాల పక్షాన బలమైన స్వరం వినిపించారని, వారి జీవితం ఆ వర్గాల కోసం అంకితం చేశారని కొనియాడారు. గిరిజన సమాజ ప్రయోజనాల కోసం శిబుసోరెన్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Remove term: దేశం గర్వించదగిన గిరిజన నేత శిబుసోరెన్ : సీఎం రేవంత్ రెడ్డి దేశం గర్వించదగిన గిరిజన నేత శిబుసోరెన్ : సీఎం రేవంత్ రెడ్డిజార్ఖండ్ లో నివాళులు అర్పించిన సీఎం...దేశం గర్వించదగిన గిరిజన నేత శిబుసోరెన్ : సీఎం రేవంత్ రెడ్డి
Comments (0)
Add Comment