దొంగ ఎవరో మీరే తేల్చండి.?
డైరెక్టర్ గా అజ్జ, మంత్రి ల తొలగింపు…
కొత్త డైరెక్టర్లతో ఆసుపత్రి నిర్వహణ…
లెక్కలు చెపితే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధం…
రూ.1.80 కోట్ల సామాగ్రి సీఎంసికి రాలేదు…
వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…
చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను : సీఎంసీ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగ
నిజామాబాద్, వార్తటుడే, ఆగస్టు 8 :
గత కొంత కాలంగా వివాదాస్పందంగా కొనసాగుతున్న డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంసి మెడికల్ కాలేజ్ లో నాలుగు నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు. అనుభవజ్ఞులైన నిపుణులు, వైద్య నిపుణుల బృందం
ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంఎస్ఆర్) ను స్థాపించింది.ఈ సంస్థ అక్టోబర్ 2024లో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో సీఎంసి మెడికల్ కాలేజ్ ను వివిధ దశల్లో రూ. 200 కోట్ల పెట్టుబడితో పునః ప్రారంభించి కొనసాగించేందుకు సిఎస్ఐ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎంఎస్ఆర్
ప్రయత్నాలతో, 500 పడకల సీఎంసి ఆసుపత్రిని మే 25న రాష్ట్ర అధికారుల ఆమోదంతో ప్రజల కోసం తిరిగి ప్రారంభించామని తెలిపారు.
సేవల కోసం వచ్చి…
ఏప్రిల్, 2025లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా పరిచయం అయ్యారనీ షణ్ముఖ మహా లింగం మీడియాకు తెలిపారు. 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించారు. ఎంసిఐ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నియమిచాలని తాను సూచించగా,
డాక్టర్ అజ్జా శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో పని చేస్తున్న డాక్టర్ మంత్రి సుమంత్, పలువురు వైద్యులను తాత్కాలిక పద్ధతిలో నియమించినట్లు చెప్పారు.వీరు నామమాత్రంగా ఆసుపత్రికి రావడం, వెళ్లడం తప్ప, పనిలో కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదు. విధులకు రాకున్నా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్నారు. దింతో రోజుకు 10 మంది రోగులు ఆసుపత్రికి రావడం లేదు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ మంత్రి సుమంత్, డాక్టర్ ఎల్.పాండు, డాక్టర్ సుమన్ కుమార్, డాక్టర్ సుర్దాని లు ఇష్టరాజ్యాంగా వ్యవహారించారు. 30 మంది వైద్యులు, 20 మంది నర్సులు, 15 మంది పారా-మెడికల్ సిబ్బంది, 25 మంది అడ్మిన్ సిబ్బంది, 35 మంది దినసరి వేతన కార్మికులను సిఎంసి సంస్థల చైర్మన్, నిర్వహణ కమిటీ అనుమతి లేకుండా నియమించారని తెలియజేశారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ఫార్మసీ దుకాణాల నిర్వహణ, నిర్మాణ పనులు, వైద్య పరికరాల కొనుగోలు, క్యాంపస్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపించారు.డైరెక్టర్ గా కొనసాగేందుకు డాక్టర్ శ్రీనివాస్ రూ. 5 కోట్ల విలువ చేసే 3 చెక్కులు ఇచ్చారని ఆ చెక్కులు డ్రా చేయడానికి వెళితే చెక్కుల డ్రా కు అనుమతి ఇవ్వొద్దని లెటర్ ఇచ్చినట్లు తెలిపారు.
కొనుగోళ్ళ పేరుతో…
గోపతి రవి కుమార్, బానోత్ ప్రీతి యాజమాన్యంలోని ములుగులోని మెస్సర్స్ బాలాజీ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎ. శంకర చారి మధ్యవర్తిగా రూ.92 లక్షల విలువైన పాత వైద్య పరికరాలను కొనుగోలు చేసారు. ఈ డబ్బు చెక్కుల రూపంలో చెల్లించాం. వీటిలో రూ.72 లక్షల సామాగ్రి ఇంక అందివ్వలేదు. ఏప్రిల్ 8, 2025లో రూ.88,84,790 విలువైన పరికరాలను కొనుగోలు చేశారు. సీఎంసి నుంచి తీసుకున్న వేకెంట్ చెక్కులను ఛైర్మెన్ అనుమతి లేకుండా
అక్కడ అందజేశారు. దీనిపై ఆ కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ తరువాతనే అజ్జ శ్రీనివాస్ ను జూన్ 10న తొలగించారు. హైపవర్ కమిటీ చివరకు అజ్జ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హెచ్పీఎస్, ఎన్ఎంసీ లు అజ్జ శ్రీనివాస్ దరఖాస్తును తిరస్కరించాయి.
ప్రభుత్వ ఉద్యోగి మోసం…
ప్రభుత్వ ఉద్యోగి అయిన మంత్రి సుమంత్ నిజామాబాద్ లోని మెడికల్ కాలేజీలో చేరినట్లు ఆయన చెప్పుకున్నారు. అయితే ఆయన వాదనకు ఆధారాలు లేకపోయినా డాక్టర్ అజ్జ శ్రీనివాస్ గట్టిగా సిఫార్సు చేశారు. ఆ విధంగా అర్హతలు లేకపోయినా ఆయనను సిఎంసి సంస్థలలో ఫ్యాకల్టీ సభ్యుడిగా నియమించారు. ప్రభుత్వ సేవ నుండి సరైన రిలీవ్ ఆర్డర్ ను సమర్పించడంలో, అతని అర్హతలు, అనుభవానికి సంబంధించిన అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించలేదు. నోటీసులు ఇచ్చిన స్పందించలేదు. ఇలా విఫలమైనందున జూన్ 10న ఆయనను తొలగించాం. వాస్తవానికి ఇతనిపై ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇతనికి కూడా సీఎంసి మెడికల్ కాలేజ్ కు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు.
*చావనైనా చస్తా గానీ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తాం.*
ఎవరి వద్ద నుంచి కూడా రూపాయి డబ్బులు వసూలు చేయలేదు.
అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాను. నేను ఎక్కడికి పారిపోలేదు. చైర్మన్ అప్రూవల్ లేకుండా డైరెక్టర్ హోదాలో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ 120 మంది నియామకం చేసారు. అర్హత లేని వారిని తొలగించాం. పూర్తి వివరాలతో వాస్తవాలను ప్రచురించి నిజామాబాద్ గ్రామీణ ప్రజలకు న్యాయం చేయండని సీఎంసి మెడికల్ కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం అన్నారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతులతో ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అతి తక్కువ ఫీజులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు.