ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
టి ఈ ఏ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, వార్తటుడే, ఆగస్టు 15 :
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి జి నిర్మల గారి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ వేడుకల్ని మనం జరుపుకుంటున్నాం. అదే సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఉద్యోగుల ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన పిఆర్సి , పెండింగ్ డీఏలు , నగదురహిత వైద్యము, పాత పెన్షన్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు సమాన పనికి సమాన వేతనం నేటికీ కరువైందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అదే సమయంలో వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటానికి వెనుకడుగు వేయరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అలా కాని పక్షంలో త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులతో సంప్రదించి తమ న్యాయమైన డిమాండ్ల కొరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ చిలగాని సంపత్ కుమార్ స్వామి, వైస్ చైర్మన్ గడ్డం బాలస్వామి, ప్రధాన కార్యదర్శి జాజాల రంజిత్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌతమ్ తత్వానంద్ చారి, ప్రతాప్, మేరీ , లావణ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీ జ్ఞాన ప్రకాష్ గారు ఎన్నమల్ల సైదులు గారు తదితరులు పాల్గొన్నారు.