పాపపు పాండవుల టార్గెట్ సీఎంసి… మాయలో మహారాజు… కనిపించని అ హస్తం రవీంద్రుడు.. సీఎంసి కబ్జాకే ప్రణాళిక… దారి తప్పిన సామంతరాజు… నేడు ప్రజల ముందుకు మహారాజు…

పాపపు పాండవుల టార్గెట్ సీఎంసి…

మాయలో మహారాజు…

కనిపించని అ హస్తం రవీంద్రుడు..

సీఎంసి కబ్జాకే ప్రణాళిక…

దారి తప్పిన సామంతరాజు…

నేడు ప్రజల ముందుకు మహారాజు…

(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో – వార్తటుడే )

అదొక మెడికల్ సామ్రాజ్యం. దాని పేరు సీఎంసి మెడికల్ కళాశాల. మెడికల్ కాలేజ్ అంటే ముందు ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, ఫార్మసి కాలేజ్, మెడికల్ కాలేజ్ వీటితో పాటు మెడికల్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ ఇలా లెక్కకు మించిన మెడికల్ వసతులు. కోట్ల రూపాయల వ్యాపారం. ఇంతటి సామ్రాజ్యనికి ఒక మహారాజు మహా షణ్ముఖం వచ్చాడు. ఒకే ఒక్కడు వచ్చి సామ్రాజ్యం పనులు మొదలు పెట్టాడు. సామ్రాజ్యం పనులకు కావాల్సిన సామంతుల కోసం వేట మొదలు పెట్టాడు. మహారాజుకు ఆ రాజ్యంలోని సామంత రాజ్యల సేవకుల నాయకుడిని పరిచయం చేసుకున్నారు. ఆలా అయిన పరిచయంతోనే సేవకుడిగా సామ్రాజ్యంలోకి ఆ నాయకుడు అడుగు పెట్టాడు. అతి తక్కువ కాలంలోనే సామంత రాజుగా మారాడు. మహారాజుకి అసలు విషయం తెలియక ఆ నాయకుడిని సామంత రాజుగా ప్రకటించారు. ఇక సామంతరాజు పీఠం ఎక్కగానే వెంటనే తన అసలు విశ్వరూపంతో పని మొదలు పట్టారు. మరి కొందరు పక్కన చేర్చుకొని గూడు పూటని మొదలు పెట్టారు.

మలుపు తిరిగింది ఇక్కడే…

సామంతరాజు అడుగు పెట్టగానే మహారాజు తన పనిలో మునిగి పోయాడు.
ఇంత వరకు బాగానే ఉన్న ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఒక కనిపించని సీనియర్ వైద్య సేవకుడు (వైద్యుడు) చక్రం తిప్పాడు. ఏకంగా మహారాజు సామ్రాజ్యనికి (మెడికల్ కాలేజీ)కి ఎసరు పెట్టారు. మరో నలుగురు సేవకులను జత కలుపుకొని సేవకులుగా ప్రకటించుకున్నాడు. సామ్రాజ్యన్ని (సీఎంసి)ని తమ చేతుల్లోకి తీసుకునేదుకే ప్లాన్ చేసారు. అందుకు ప్లాన్ రెడీ కాగానే అమలులోకి దిగారు. ముందు సామంతరాజు (డైరెక్టర్ )గా శ్రీనివాసులు సిద్ధం కాగా వ్యూహాకర్త రవీంద్రుడు, పెట్టుబడికి విక్రమాధిత్యుడు, వినీలాదిషుడు వీరితో పాటు మెనజ్మెంట్ కోసం రాజేంద్రుడు కలిసి పావులు కదిపారు. ఇంకేముంది అన్నింటికీ సిద్ధంగా ఉన్న సీఎంసి సామ్రాజ్యానికి పందేరం వేశారు. ఈ సామ్రాజ్యనికి అసలు మహారాజును బయటకు పంపి తామే పాలించేలా చక్రం తిప్పారు. ఇందు కోసం ప్రణాళిక బద్దంగా పావులు కదిపారు. ఇక్కడే అసలు కథ మొదలు అయింది.

మహారాజుకు సూస్తి…

సామ్రాజ్యం పనులు ఉపందుకోవడంతో మహారాజు సైతం అన్ని బాధ్యతలు సామంతరాజు కు అప్పగించారు. అంత సవ్యంగా జరుగుతుంది అనుకుంటూ ఉండగా మహారాజుకు సూస్తి చేసింది. ఇదే అదునుగా మహారాజును సూదూరం చికిత్స నిమిత్తం పంపి తమ పని చేసుకున్నారు. అంతకు ముందు అనుకున్నట్లుగా ఎవరికీ వారే పనులకు ఉపక్రమించారు. ప్రణాళిక చేసిన సేవకుడు అనుమతుల పేరుతో రంగంలోకి దిగారు. పెట్టుబడి పెడుతున్న ఇద్దరు సేవకులు సామాగ్రి కొనుగోలు కోసం వెళ్లారు. మరో సేవకుడు ఏకంగా సామ్రాజ్యం పరిపాలనలో కావాల్సిన ఏర్పాట్లు చేసారు. ఏకంగా సామ్రాజ్యంలో అన్ని బాగాల్లో తమ సైన్యాన్ని (నియమకాలు) సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ అర్హత ఉన్న లేకున్నా తమ అనుకున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారు. మొత్తానికి సామంతరాజు రాజ్యాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంకేముంది సదరు సామంతరాజు ఏది చెపితే అదే వేదం, అదే నినాదం. ఇక సేవకులుగా వచ్చిన వారు సైతం తమ సామంత రాజ్యాలను ప్రకటించుకున్నారు. మహారాజు వచ్చే నాటికీ చేయాల్సిన ప్రణాళిక సిద్ధం అయింది. సూస్తి నుంచి కోలుకున్న మహారాజుకు సమస్యల కొలిమి చూపి వాటిని పరిష్కరించాలని అడ్డుకున్నారు. నిరసన తెలిపారు. చివరకు మహారాజును అబాసుపాలు చేసి చెరసాలకు పంపాలని కుట్ర చేసారు. చివరకు చెరసాల మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇందుకు ఖజానా ఖాళీ ఉందని, ఇంత కాలం సామ్రాజ్యన్ని మేమే పాలించమని, అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పుకున్నారు. అందుకు ఆ ఖర్చు అంత ఇస్తే రాజ్యాన్ని వదిలేస్తామని హెచ్చరించారు. మహారాజుకు సూస్తి చేస్తే చివరకు రాజ్యానికే ఎసరు వచ్చింది. చివరకు అన్ని విధాల కోలుకున్న మహారాజు నేడు (సోమవారం) ప్రజల ముందుకు రానున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు బయట పడనుంది.

ఆ సామ్రాజ్యం పేరే డిచ్పల్లి “సీఎంసి మెడికల్ కాలేజ్”, మహారాజు పేరు “షణ్ముఖ మహాలింగం”… అయితే సామంతరాజులు, సేవకులు ఎవరు అనే కదా మీ అనుమానం.?

ఎవరు వారు.?

ఒక్కరు గతంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సదరు వ్యక్తి అన్ని స్థాయిల్లో అనుమతుల పేరుతో పని చేయగా సామంతరాజుకు ముఖ్య సలహాదారుగా, వ్యూహకర్తగా పని చేసాడు. ఆయన పేరే రవీంద్రుడు. ఇక విక్రమాధిత్యడు, వినీలాదిషుడు సామంతరాజుకు కోశాధికారులుగా పని చేసి పెట్టుబడి పెట్టారు. ఎన్ని కోట్లు అయిన పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పుకున్నారు. వినీలాదిషుడు బంధువుకు నర్సింగ్ కళాశాల నడిపిన అనుభవం ఉంది. ఇక రాజేంద్రుడు సామంతరాజుకు సహాయకారిగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి. ఎలా వ్యవహారించాలో సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఈ పంచపాప పాండవుల అసలు కథలు రోజుకు ఒకటి చొప్పున “వార్తటుడే” ప్రచురిస్తుంది.
వీరింతా నిజామాబాద్ జిల్లా మెడికల్ సామ్రాజ్యంలో పేరు మోసిన వారినని పేరు ఉంది మరి. ఇది ఎంత వరకు నిజమో జిల్లాలోని ప్రజలకు, వారితో ఉండే సేవకులకే తెలియాలి.

సీఎంసి మెడికల్ కాలేజ్ డిచ్ పల్లి
Comments (0)
Add Comment