కత్తెర పొట్ల కలకలం….
ఒక్కరి మృతి… పలువురికి గాయాలు…
ఓ సైకో నిర్వాహకం…
ధర్పల్లి, వార్తటుడే, సెప్టెంబర్ 02 :
ధర్పల్లి మండలకేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. ఎన్టీఆర్ కాలనికి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి కాలనీలో నలుగురిని దర్జీ కత్తెరతో పొడిచాడు. మొదటగా కాలనీలోని మచ్చ లక్ష్మీ ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్ళగా ఆమెను కూడా పొడిచాడు. అక్కడ గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వారు వెళ్ళగా వారిలో శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా కత్తెరతో పొడిచాడు.
అక్కడి నుండి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తి షాపు దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొడిచాడు. గాయపడ్డ నలుగురిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని, సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే వారిలో ఒక్కరూ మరణించినట్లు తెలిసింది.