మళ్లీ సొసైటీల పదవీకాలం పొడగింపు…
అవినీతి ఆరోపణలో ఉన్న చైర్మన్ ల స్థానంలో కొత్తవారికి అవకాశం
ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించిన ప్రభుత్వం
అధికారులు చేసిన విచారణ పై చర్యలుండేనా.?
కాంగ్రెస్ లో చేరిన అక్రమాలకు పాల్పడిన చైర్మన్లు
చర్యలు శూన్యమేనా.?
(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో – వార్తాటుడే)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్) లా పదవి కాలాన్ని మరికొంత కాలం పొడిగించింది. తదుపరి ఆదేశాల జారీ అయ్యే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీలు కొనసాగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 386 జీవోను జారీ చేసి సొసైటీల కాలపరిమితిని పెంచాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 146 పైగా పిఐసిఎస్ సొసైటీలు పనిచేస్తున్నాయి. నిజామాబాద్ లో 84 కామారెడ్డి లో 54 సొసైటీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే వీటిలో పలు సొసైటీల పాలకవర్గాలపై అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నాయి. ఒకొక్క సొసైటీలో కోట్ల రూపాయలు కొల్లగోట్టారు. ఈ ఆరోపణలు ఉన్న సొసైటీలకు తాత్కాలిక చైర్మన్ లను లేదా ఇంచార్జీ అధికారులను నియమించేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గాల స్థానంలో ఇన్చార్జిలకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే వీటి ఎంపిక బాధ్యతను జిల్లా కోపరేటివ్ అధికారులకు కాకుండా స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధిత పాలకవర్గ నేతలకు అప్పగించడం సమస్యగా మారనుంది. ఇప్పటికే కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడిన సొసైటీ చైర్మన్ లపై విచారణ పూర్తి చేసేందుకు కోపరేటివ్ సొసైటీ అధికారులు మల్లగులాలు పడుతున్నారు. గత ప్రభుత్వం హయంలో కోట్ల రూపాయలు మింగిన సొసైటీ ఛైర్మెన్ లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దింతో అధికారులకు సైతం వారిపై విచారణ చేయడం తలనొప్పిగా మారింది. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల అండదండలతో యాదచ్చగా తమ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు.
అప్పుడు ఆరోపణలు… ఇప్పుడు అందలం…
నిజామాబాద్ జిల్లాలోని సొసైటీలు అంటే రాష్ట్రంలోని అవినీతి అక్రమాలకు మొదటి స్థానంలో ఉన్నాయి . ఇప్పటివరకు 14 పైగా సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నట్లు రుజువైంది. కానీ ఇంతవరకు ఆ సొసైటీ చైర్మన్ లపై చర్యలు తీసుకోలేదు . ఇది ఇలా ఉంటే గతంలో కో ఆపరేటివ్ జిల్లా అధికారిగా పనిచేసిన సింహాచలంపై ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అనంతరం కొంతకాలం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని పలు సొసైటీలలో ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్ లపై ఆరోపణలు ఉన్నప్పటికీ సభ్యులు ఫిర్యాదు చేసిన కోపరేటివ్ శాఖకు చెందిన జిల్లా అధికారులు విచారణ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా బాన్సవాడ, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు సొసైటీలపై పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన సొసైటీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే పార్టీ కండువా మార్చుకొని తమ అవినీతి అక్రమాలపై విచారణ కొనసాగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు ప్రత్యేకంగా సొసైటీ చైర్మన్ లను పావుగా వాడుకొని తమ పబ్బం గడుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా కోటగిరి, బోధన్, బాల్కొండ ఎరగట్ల, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ మండలాల్లోని సొసైటీలలో అక్రమాలపై విచారణ కొనసాగుతున్నాయి. కొన్ని సొసైటీలపై ఇప్పటికే విచారణ పూజ చేసి జిల్లా కోపరేటివ్ అధికారికి సమర్పించారు. కానీ ఆ ఫైళ్ళను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ వారిని చైర్మన్ లుగా కొనసాగిస్తున్నారని విషయం తెలిసిందే. గతంలో గతంలో చేసిన అవినీతి అవకలమాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమార్కులైన చైర్మన్ లను నెత్తిన వేసుకొని తిరగడం విశేషం అయితే వీటిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాలి. మరోవైపు ఆయా నియోజకవర్గాలలో బిజెపి ఎమ్మెల్యేలు ముగ్గురు, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఛైర్మెన్ ల స్థానంలో ఆయా సొసైటీ కొత్త చైర్మన్ ల ఎంపిక ఎలా చేస్తారనేది వేచి చూడాలి.