చెక్ పెట్టేందుకే..? డ్రామా కంపెనీ… సీఎస్ఐ ప్రతినిధుల చేవిలో పువ్వులు… సీఎంసీ కోసం డాక్టర్ల మాయాజాలం… కబ్జా చేసేందుకు ప్రయత్నాలు… తప్పుడు లెక్కలతో ప్రచారం…

  • సీఎంసీ డ్రామా – 2…..

చెక్ పెట్టేందుకే..? డ్రామా కంపెనీ…

సీఎస్ఐ ప్రతినిధుల చేవిలో పువ్వులు…

సీఎంసీ కోసం డాక్టర్ల మాయాజాలం…

కబ్జా చేసేందుకు ప్రయత్నాలు…

తప్పుడు లెక్కలతో ప్రచారం…

(నిజామాబాద్ బ్యూరో – వార్తటుడే )

*“అబద్దాన్ని వందసార్లు వళ్ళిస్తే నిజం అవుతుందట”* అన్న సామెతల ఉంది సీఎంసీ మెడికల్ కాలేజ్ పై నిజామాబాద్ డాక్టర్లు చేస్తున్న ప్రచారం. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వచ్చిన వ్యక్తి రెండు కోట్ల రూపాయలతో పారిపోయాడు అని ప్రచారం చేసస్తూ ఎలా నమ్మించారో ఎక్కడ మనం ప్రశ్నించుకోవాలి. అదికాక ఉద్యోగం కోసం వెళ్లిన డాక్టర్లు ఏకంగా మేమే ఓనర్లం, మాకే రైట్ ఉందని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటీ.? 110 మంది సిబ్బంది ఉన్న హాస్పిటల్ లో 10 మంది కూడా రోగులు లేకపోయిన సేవలు చేసామని, వేతనాలు ఇవ్వలేదని వివాదం లేపడం వెనుక ఉన్న కారణం ఏమిటీ.? ఓ డాక్టర్ తేదీలు వేసి మరి రూ. 5 కోట్ల చెక్కులు ఇచ్చి డైరెక్టర్ పదవి ఆశించడం, ఆ తర్వాత ఆ చెక్కులు డ్రా చేయవద్దని బ్యాంక్ కు ముందే లేటర్ ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏమిటీ.? మరో డాక్టర్ అలాగే డైరెక్టర్ పదవి కోసం అని ఓ కాంట్రాక్టర్ (డాక్టర్ మిత్రుడు కాంట్రాక్టర్) తన తరపున రూ. 50 లక్షల చెక్కు ఇచ్చి అందులో తప్పుడు సంతకం చేసారు. సంతకం సరిగ్గా లేదని, బ్యాంక్ అధికారులు చెక్కును వెనక్కి పంపారు. నిజంగా గ్యారంటీ చెక్కులు ఇస్తే తేదీలతో సహా ఎందుకు ఇస్తాం. కానీ ఇక్కడ తేదీలతో సహా చెక్కులు ఇవ్వడం, పోస్టు వచ్చాక కొత్త డ్రామా మొదలు పెట్టడమే అనుమానాలకు తావిస్తుంది. మొత్తం ఈ చెక్కుల నాటకంలో రాజులు ఎవరు.? రాబంధులు ఎవరు.? అనేది త్వరలో సీఎస్ఐ పెద్దలు తేల్చనున్నారు.

మాయమాటల పెట్టుబడులు…

సీఎంసీలో పెట్టుబడుల పేరుతో ముగ్గురు డాక్టర్లు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల డాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేసారు. ముగ్గురు డాక్టర్లు కీలకంగా వ్యవహరించి ఈ తాతంగం నడిపారు. అప్పటికే సీఎంసీ మెడికల్ కాలేజ్ లో ఆసుపత్రికి అనుమతి వచ్చింది. నర్సింగ్ కాలేజ్, ఫార్మసి కాలేజ్ ల అనుమతులకు ప్రాసెస్ కొనసాగుతుంది. ఇంకేం ఉంది… వెంటనే ఎలాగైనా సీఎంసీని కబ్జా చేయాలని పెట్టుబడులు సేకరించి చెల్లింపులు చేయడం మొదలు పెట్టారు. ఆయా డాక్టర్లకు తప్పుడు సమాచార ఇచ్చి పెట్టుబడులు సేకరించి, హంగామా చేసారు. ఈ మాయ మాటలు నమ్మిన డాక్టర్లు మంచి అవకాశంగా తీసుకోని చెల్లింపులు చేసినట్లు సమాచారం. కానీ హఠత్తుగా సీఎంసీ చైర్మన్ షణ్ముఖమహాలింగం తెరపైకి రావడం, మీడియా సమావేశం పెట్టడంతో డాక్టర్లలో గందరగోళం మొదలు అయింది. జరిగిన తాతంగం అర్థం కాకపోవడంతో తలలు పట్టుకున్నారు. కొందరు తమ పెట్టుబడి వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో మరో నాటకానికి తెర తీసారు. అదే సీఎస్ఐ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం. అప్పటికే ప్రణాళిక ప్రకారం సీఎస్ఐ పెద్దలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మెదక్ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేతను రంగంలోకి దించారు. ఇలా ఏకంగా సీఎస్ఐ పెద్దలనే దారి తప్పించినట్లు తెలిసింది. అలా డాక్టర్ల నుంచి పెట్టుబడి రూపంలో తీసుకున్న డబ్బు సీఎంసీలో ఖర్చు చేసినట్లు చూపించేందుకు సమయాత్తం అయినట్లు కొందరు డాక్టర్లు బహిరంగ మాట్లాడుతున్నారు.

పెద్దలతో పేచీ పెట్టించి…

సీఎస్ఐ ట్రస్ట్ అసోసియేషన్ (సీఎస్ఐటిఏ) కీలకం అయింది. వీటితో పాటు సీఎస్ఐ మెడికల్ బోర్డు పని చేస్తుంది. ఈ బోర్డు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల పనులు చూస్తుంది. అయితే నిజామాబాద్ కు చెందిన ముగ్గురు డాక్టర్లు రంగంలోకి దిగి బోర్డు ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త నాటకానికి తెర లేపారు. అదే… సీఎంసీ మెడికల్ కాలేజ్ చైర్మన్ షణ్ముఖ మహాలింగం పారిపోయాడని, వేతనాలు ఇవ్వలేదని, మా డబ్బులు రెండు కోట్ల మేరకు ఎగవేశారని చెప్పుకొచ్చారు. ఇలా నమ్మించి తాత్కలికంగా గౌరవ డైరెక్టర్ గా పోస్టు తీసుకున్నట్లు సమాచారం. దీనికి బోర్డు కన్వీనర్ సైతం ముందుకు రావడంతో పని సులువు అయింది. అందుకు ఉదాహరణ… సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ కూడా షణ్ముఖ మహాలింగంకు లీజుకు ఇవ్వలేదని చెప్పలేదు. మహాలింగం గురించి ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదు. కానీ సీఎస్ఐ తరుపున గౌరవ డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్ ఉంటూ సీఎంసీ ఆసుపత్రిలో సేవలు అందిస్తారని చెప్పారు. కానీ మెడికల్ కాలేజీ లీజు వ్యవహారం మాత్రం బయటకు చెప్పలేదు. ఇక్కడ అంతర్ధం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత కన్వీనర్ దయానంద్ మీడియా ప్రతినిధులు ఎవరు ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేసిన స్పందించలేదు. ఇలా సీఎస్ఐ పెద్దలతో ఛైర్మెన్ కు పేచీ పెట్టించి కొత్త నాటకానికి తెర తీశారు. ఈ నాటకం ఇంకా కొనసాగుతూనే ఉంది.

తప్పుడు లెక్కలతో…

*“అయ్యో పాపమని ఈసంతా జాగిస్తే ఇల్లంతా నాదే అన్నాడట”* అన్న సామెతల ఉంది నిజామాబాద్ డాక్టర్ల పని తీరు. సీఎంసీలో ఉద్యోగం ఇచ్చిన పాపానికి నకిలీగా, మోసగానిగా నిలవాల్సి వచ్చింది. సంవత్సరం అద్దె రూ.3 కోట్లకు పైగా ఒప్పందం చేసుకొని, కాలేజ్ ప్రారంభం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, సీఎంసీ అభివృద్ధి కోసం రూ. 20 కోట్లకు పైగా సిద్ధం చేసుకొని, మొత్తం రూ. 280 కోట్ల ప్రాజెక్టుతో సీఎంసీ మెడికల్ కాలేజ్ ప్రారంభించడానికి వచ్చిన వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేసారు. ఏకంగా రూ.2 కోట్లు ఎత్తుకొని పోయారని తప్పుడు లెక్కలు చెప్పారు. చెక్కు బౌన్స్ కేసులు ఉన్నాయని తప్పుడు  ప్రచారం చేసారు. చివరికి పోలీసు కేసు కూడా నమోదు చేయించారు. 18 ఏళ్లుగా కళ్ల ముందు ఉన్న మెడికల్ కాలేజ్ ఊసే ఎత్తని నిజామాబాద్ డాక్టర్లు సడన్ గా తెరపైకి వచ్చి పెట్టుబడుల డ్రామాకు తెర లేపారు. చివరకి కాలేజ్ అభివృద్ధికి డబ్బులు ఇచ్చామని, పనులు చేయించామని, వేతనాలు ఇవ్వలేదని ఇలా అంతుపొంతు లేని ప్రచారం చేసారు. కోట్ల ఖర్చుతో కూడుకున్న సీఎంసీలో నిజామాబాద్ డాక్టర్ల, సీఎస్ఐ పెద్దల డ్రామా *“నవ్వి పోదురు గాక నాకేమిటి సిగ్గు”* అన్నట్లుగా మారింది.
దింతో కాలేజ్ లో చేరిన ఎంతో మంది వెనక్కి వెళ్లిపోయారు.

@@@@@@@@@

తరువాయి భాగం : సీఎంసీ డ్రామా – 3
*” చేసిందత మోసం… అయ్యావారి దయ కోసం ఆరాటం” – “ఛీ”ఎస్ఐ పెద్దల ఆట… బలి అయ్యేది ఎవరట…”*

చెక్ పెట్టేందుకే..? డ్రామా కంపెనీ... సీఎస్ఐ ప్రతినిధుల చేవిలో పువ్వులు... సీఎంసీ కోసం డాక్టర్ల మాయాజాలం... కబ్జా చేసేందుకు ప్రయత్నాలు... తప్పుడు లెక్కలతో ప్రచారం...
Comments (0)
Add Comment