ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర… రూ. 190 కోట్లతో ఆలయ అభివృద్ధి… 2027 గోదావరి పుష్కరాలు… మంత్రి జూపల్లి కృష్ణారావు…

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర…

రూ. 190 కోట్లతో ఆలయ అభివృద్ధి…

2027 గోదావరి పుష్కరాలు…

మంత్రి జూపల్లి కృష్ణారావు…

బాసర, వార్తటుడే, సెప్టెంబర్ 10 :

దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ. 190 కోట్లు మంజూరు చేసారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు బాసర ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ ఆదాయ, వ్యయాలు, ఏటా వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తదితర అంశాలపై చర్చించారు. ఆదాయ, వ్యయాలను రోజువారీగా కంప్యూటర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆలయ నిర్వహణపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష లు నిర్వహించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి…

2027 లో వచ్చే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర... రూ. 190 కోట్లతో ఆలయ అభివృద్ధి... 2027 గోదావరి పుష్కరాలు... మంత్రి జూపల్లి కృష్ణారావు...
Comments (0)
Add Comment