7వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు

7వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు

డిచ్‌పల్లి వార్తటుడే

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో గురువారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా జరిపారు. కార్యక్రమాన్ని బెటాలియన్ అదనపు కమాండెంట్ సి.హెచ్. సాంబ శివరావు ఆధ్వర్యంలో బెటాలియన్ లో యం టి పార్క్ వద్ద ప్రభుత్వ పాఠశాల, విక్టరీ హై స్కూల్, విద్యా హై స్కూల్ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కమాండెంట్ సాంబశివరావు మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది త్యాగం, నిబద్ధత, కర్తవ్యబద్దత అమర వీరులకు నివాళిగా నిలుస్తుందని, అమర వీరుల స్ఫూర్తితో భవిష్యత్లో మరింత కర్తవ్యపరులుగా పనిచేయాలని సిబ్బందిని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు కె.పి శరత్ కుమార్, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Police Martyrs' Week celebrations in the 7th Battalion
Comments (0)
Add Comment