సిఎస్ఐ డయోసీస్ లో అధ్యక్షణ ఎన్నికలు……… 38వ గోదావరి డిసిసి చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు…….

సిఎస్ఐ డయోసీస్ లో అధ్యక్షణ ఎన్నికలు………

38వ గోదావరి డిసిసి చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు…….

సిఎస్ఐ గోదావరి డిసిసి ఛైర్మన్ గా రేవరెంట్ సిహెచ్. జార్జి ఎన్నిక.

డిచ్‌పల్లి వార్తటుడే

డిచ్‌పల్లి మండలంలోని సీఎంసి కాలేజ్ లో గోదావరి జిల్లాల చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి, గోదావరి జిల్లాల చైర్మన్ గా రేవరెంట్ సిహెచ్ జార్జి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సి ఎస్ ఐ మాడరేటర్ ద మోస్ట్ రేవ ప్రో,డా రూబెన్ మార్క్ తండ్రిగారికి మెదక్ అధ్యక్షా మండలం పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసారు. వారందరి ప్రోత్సాహం వలన గోదావరి డిసిసి లో ఉన్నటువంటి సీనియర్ అయ్యగార్లు, జూనియర్ అయ్యగార్లు, లే నాయకులు అందరి ప్రోత్సాహం వలన, వారందరూ ఎన్నో విషయాలలో సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు సాగడానికి, ఈ అవకాశం పొందడానికి, బలపరిచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి డిసిసి ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తానని, అన్ని వర్గాల వారికి, ఒక సేవకుడిగా పనులు జరిగించడానికి సహాయ సహకారములు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాడరేటర్ సిఎస్ఐ బిషప్ ఇన్చార్జ్ మెదక్ డయాసిస్ ద మోస్ట్ రెవరెంట్ .ప్రో, డాక్టర్. రూబిన్ మార్క్, ప్రో, డాక్టర్. బి విమల్ సుకుమార్, రివరెంట్ యం.జయానంద్, జి ప్రభు కిరణ్ కుమార్, రేవరెంట్ యేసు కుమార్, కాంగ్రెస్ నాయకులు మెట్టు శాంసన్, వి శైలేందర్ పాల్గొన్నారు.

Presidential Elections in CSI Diocese........ 38th Godavari DCC Church Council Elections.......
Comments (0)
Add Comment