తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మాస్ లైన్ పార్టీ డిమాండ్

తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మాస్ లైన్ పార్టీ డిమాండ్

డిచ్‌పల్లి వార్తటుడే

అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ప్రభుత్వ వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు ఆరుంగాలం కష్ట పడి రైతలు పంటలు పండిస్తే, అకాల వర్షాల వల్ల చేతికోచ్చినపంట చేజారి పోతుందని, రైతుల కండ్ల ముందే వరి ధాన్యం తడిసి ముద్దయితే రైతు గుండె బరువెక్కుతుందని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ రంకె లేస్తున్న పాలకులకు రైతుల బాధలు పట్టవా అని ఆయన నిలదీశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేననీ ఆయన అన్నారు. బోయిల్డ్ రైస్ మిల్స్ లను తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులు దుఃఖము నుండి దూరం కావడానికి ఆస్కారం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచినామనీ ప్రకటిస్తున్నప్పటికీ ఐకెపి, సహకార సంస్థల నిర్లక్ష్యం వల్ల రైతులు బాధ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లమీద వడ్లు ఆరా బోసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు.తడిసిన వరి ధాన్యం నల్లబడి, మొలకలెత్తుతుందని రైతులు వరి ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు అమ్మి నష్టపోతున్నారని, ఆయన తెలిపారు. వరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతోపాటు, వరి ధాన్యాన్ని బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి రైతులకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్నదాతను ఆదుకోని ప్రభుత్వాలు పతనం కాక తప్పదని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నమ్మించి, రైతుల భూకమతాలను కార్పోరేట్లకు అప్ప జెప్పే కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల వానలకు తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.వ్యవసాయ రంగానికి అనుబంధంగా పరిశ్రమల జిల్లాలో విరివిగా నెలకొల్పి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా మండల కార్యదర్శి బోశెట్టి మురళి సహాయ కార్యదర్శి మోహన్ గంగాధర్ మల్లేష్ రాములు గణేష్ సంధ్య కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Mass Line Party demands that the government should immediately purchase the soaked paddy rice
Comments (0)
Add Comment