శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

డిచ్పల్లీ వార్త టుడే

ఏడోవ బెటాలియన్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఏడోవ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

Leave A Reply

Your email address will not be published.