తప్పుడు ఆధారాలతో పక్క తవ్వ పట్టిస్తున్న ఇందిరమ్మ ఇల్లు
ఇందల్వాయి, వార్తటుడే అక్టోబర్23
ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామానికి చెందిన కొండ సవిత భర్త.నారాయణ ఇంటి నెంబర్ 1-2-4/1/1 గల 15 సంవత్సరాల క్రితం గత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇల్లు ఇచ్చినప్పటికీ మళ్లీ ఇందిరమ్మ ఇల్లు పేరిట అధికారులను తప్పు ద్రోవ పట్టించి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించుకొని లింగాపూర్ గ్రామానికి చెందినా కారబర్ రవి అతనికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇల్లు ఉన్నప్పటికీ నూతనంగా ఇందిరమ్మ పేరిట మరో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అర్హులైన వారికి ఇపించాల్సింది పోయి తన సొంత స్వలభాలకు పోయి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఇందిరమ్మ ఇల్లును నిర్మిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను క్యాన్సల్ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు తెలిపారు. అర్హులను అనరులను చూసే. అధికారులే ఇట్లా తప్పులు చేస్తే పేదవారి పరిస్థితి ఏంటిది. అని ప్రజలు వాపోతున్నారు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ. పేదవారిని వదిలిపెట్టి తన సొంత లాభానికి చూసిన. కారోబార్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు పేదింటి వారి కల నెరవేస్తానని ఓవైపు రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నారు. ఇలా అధికారులు సీఎం మాట కూడా వినకుండా అధికారులు కుమ్మక్కై. కొందరి రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ఈ విధంగా చేయడం సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు ఇకనైనా పేదవారిని గుర్తించాలని ప్రజలు. వాపోతున్నారు. పూర్తిగా ఇల్లు లేని వారి పరిస్థితి ఏంటో వేచి చూడవలసిందే.?