బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి.  సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి.

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్



డిచ్‌పల్లి వార్తటుడే

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని కపట నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్. బిజెపి పార్టీలు అవలంబిస్తున్న విధానాలు బీసీలను మోసం చేసే విధంగా ఉన్నాయని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి బోశెట్టి మురళి అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వెంటనే రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొంది ఎన్నికల్లోకి వెళ్లాలని అన్నారు.

తెలంగాణలో నిధులు లేక గ్రామపంచాయతీలు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నాయని తక్షణమే నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలు జరపటం జాప్యం చేస్తున్నారని తక్షణమే ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

బిజెపి కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్ల అమలయ్యే విధంగా పార్లమెంటులో బిల్లు పెట్టించి గవర్నర్ సంతకం తో ఆమోదింప చేపించాలి. వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ రిజర్వేషన్ బిల్లుపై జరిగే పోరాటంలో పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు వాసరి మోహన్ రాజేందర్ శకుంతల కిషన్ పోశయ్య అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.