ఏసీబి అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ మున్సిపల్ ఆర్ఐ.

ఏసీబి అధికారులకు పట్టుబడిన మున్సిపల్ ఆర్ఐ.

నిజామాబాద్ క్రైమ్, వార్తటుడే, సెప్టెంబర్ 3 :

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ ఐ) శ్రీనివాస్ చారి ఏసీబీకి చిక్కారు. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసచారి రూ. 7 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దాడి అనంతరం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.