సీఎంసిలో సీఎస్ఐ భాగోతం… నిజంగా ఎవరి అధీనంలో సీఎంసి..? అయితే ఈ అగ్రిమెంట్ల సంగతేమిటీ..? డైరెక్టర్ గా నియామకం చేసేది ఎవరు…? సీఎస్ఐలో చిత్రాలేన్నో..?
సీఎంసిలో సీఎస్ఐ భాగోతం
నిజంగా ఎవరి అధీనంలో సీఎంసి..?
అయితే ఈ అగ్రిమెంట్ల సంగతేమిటీ..?
డైరెక్టర్ గా నియామకం చేసేది ఎవరు…?
సీఎస్ఐలో చిత్రాలేన్నో..?
(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో – వార్తటుడే )
సీఎంసి మెడికల్ కాలేజ్ వ్యవహారం మలుపులు తిరుగుతుంది. ఇంతకు ఇందులో ఏది నిజమో ఇప్పుడు చెప్పాల్సింది సీఎస్ఐ మెడికల్ బోర్డు సమాధానం చెప్పాలి. అందులో కీలక వ్యక్తిగా ఉన్న దయానంద్ పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కరికి లీజు అగ్రిమెంట్ చేసి మరోవైపు నియామకాలు చేయడం విస్మయానికి గురి చేస్తుంది.
ఇదేం తీరు…
ఒక్కటి… 2024 అక్టోబర్ 24న ఇంటిగ్రెటెడ్ మెడికల్ సైన్సెస్ రీసర్చ్ లిమిటెడ్ కు 9 సంవత్సరాలకు గాను సంవత్సరానికి రూ. 3 కోట్లు అద్దె చెల్లించాలి. ఇలా 36 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. 2025 ఫిబ్రవరి 17న సీఎంసి మెడికల్ కాలేజ్ ను ఛైర్మెన్ హోదాలో షణ్ముఖ లింగం అధీనంలోకి తీసుకున్నారు. ఈ అగ్రిమెంట్ లో సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్, సభ్యులు సల్మాన్ రాజులు సంతకాలు చేసారు. అంటే షణ్ముఖలింగంకు పూర్తి భాద్యత అప్పగించినట్లే అని తెలుస్తుంది.

రెండు… జూలై 30, 2025న అజ్జ శ్రీనివాస్ ను సీఎంసి మెడికల్ కాలేజ్, ఆసుపత్రికి గౌరవ డైరెక్టర్ గా తాత్కాలికంగా నియమిస్తూ సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ ఉత్తర్వు ఇచ్చారు. ఒక్కరి సంతకం మాత్రమే ఉంది. దీనినే విలేకరుల సమావేశంలో అజ్జ శ్రీనివాస్ మీడియా ముందు పెట్టారు. అయితే ఒక్కరికి లీజుకు ఇచ్చిన సీఎస్ఐ బోర్డు ప్రతినిధులు ఆ తరువాత మళ్ళీ అందులో దూరి అజ్జ శ్రీనివాస్ కు గౌరవ డైరెక్టర్ గా నియమించడం వెనుక అంతరంగం ఏమిటి అనేది అంతుచిక్కని ప్రశ్న. ఇక ఇందులో అసలు దోషులు ఎవరు.? తప్పేవరిది.? అనేది అంతు చిక్కడం లేదు.

ఇదేమిటీ అయ్యా గారు…
సీఎస్ఐ అంటే నమ్మకానికి, సేవకు ప్రతిక. అలాంటి సీఎస్ఐ మెడికల్ బోర్డు ప్రతినిధులుఇలాంటి వ్యవహారం చేయడం అంటే జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇప్పటికే ఛైర్మెన్ హోదాలో షణ్ముఖలింగం మెడికల్ కాలేజ్, ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. షణ్ముఖ మహాలింగం అజ్జ శ్రీనివాస్ ను డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఫలితంగానే అజ్జ శ్రీనివాస్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విషయాలను ఛైర్మెన్ బహిర్గతం చేసారు. ఇది జరిగిన గంటల్లోనే అజ్జ శ్రీనివాస్ నేనే గౌరవ డైరెక్టర్ ను అని సీఎంసిలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. దింతో సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకు షణ్ముఖ మహాలింగం కు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో దూరి అజ్జ శ్రీనివాస్ ను గౌరవ డైరెక్టర్ గా నియమించడం వివాదానికి దారి తీస్తుంది. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకోని ఐఎంఎస్ఆర్ చైర్మన్ షణ్ముఖలింగంకు అగ్రిమెంట్ చేసిన దయానంద్ అజ్జ శ్రీనివాస్ ను గౌరవ డైరెక్టర్ గా నియమించడం వెనక లక్షల రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతుంది. కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తుల వ్యవహారం ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకు అజ్జ శ్రీనివాస్ కు గౌరవ డైరెక్టర్ గా అవకాశాన్ని ఇచ్చిన దయానంద్ ఆదేశాలు చెల్లుబాటు అవుతాయా కాదా అనేది తేల్చల్సింది సీఎస్ఐ మెడికల్ బోర్డు ప్రతినిధులే కదా. అయితే ఈ విషయమై సీఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ ను “వార్తటుడే” వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు.